Pradhan Mantri Shram Yogi Maan-dhan scheme fact check: సోషల్ మీడియా ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఫేక్‌న్యూస్ కూడా విరివిగా వైరల్ అవుతోంది. కొంతమంది పనిగట్టుకొని తప్పుడు వార్తలను, ప్రజలను తప్పుదారి పట్టించే వార్తలను క్రియేట్ చేసి మరీ షేర్ చేస్తున్నారు. కొందరేమో క్రియేటివిటీ పేరుతో, మరికొందరేమో వ్యూయర్ షిప్ కోసం, ఇంకొందరేమో పనిగట్టుకొని ఫేక్‌న్యూస్‌ను వైరల్‌గా మారుస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ పోస్ట్ సోషల్ మీడియాలో షికార్లు చేస్తోంది.
వైరల్ అవుతున్నది ఏంటి?
'ప్రధానమంత్రి శ్రమయోగి మాన్‌ధన్ యోజన' పథకం కింద కేంద్ర ప్రభుత్వం రూ.1800 ఇస్తోందన్నది ఆ పోస్ట్ సారాంశం. 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లందరూ ఈ పథకానికి అర్హులని ఆ వైరల్ మెస్సేజ్‌లో పేర్కొన్నారు.
ఈ మెస్సేజ్లోనే ఓ లింక్ కూడా షేర్ చేశారు. పై పథకం కింద దరఖాస్తు చేసుకోవాలనుకునేవాళ్లు.. లింక్‌పై క్లిక్ చేసి వివరాలు నమోదు చేసుకోవాలని వైరల్ మెస్సేజ్‌లో సూచించారు. అందులో ప్రధాని నరేంద్రమోడీ ఫోటో కూడా చేర్చారు. అంటే, అధికారికంగా ప్రభుత్వమే ఈ మెస్సేజ్‌ను రూపొందించినట్లు జనం భావించేలా వైరల్ పోస్ట్‌ను క్రియేట్ చేశారు.
జీ తెలుగు ఫ్యాక్ట్ చెక్ :
ఈ పోస్ట్‌ను సునిశితంగా పరిశీలిస్తే అందులో ఉన్న సమాచారం ప్రామాణికంగా కనిపించలేదు. ఎందుకంటే అందులో ఉన్న లింక్ ప్రభుత్వ అధికారిక లింక్‌ను పోలినట్లు లేదు. అయితే, నిజమేంటో తెలుసుకునేందుకు జీ న్యూస్ ఆ లింక్‌ను క్లిక్ చేసింది. ఏదో ఒక పేజీ ఓపెన్ కాకుండా.. ఈ పేజీ అందుబాటులో లేదు అనే మెస్సేజ్ కనిపిస్తోంది.
వాస్తవమేంటి?
అసలు ఈ పథకం వివరాలేంటి? ఎప్పటినుంచి అందుబాటులోకి వచ్చింది? ఎవరికోసం ఈ పథకం ప్రారంభించారు? వంటి అంశాలు తెలుసుకునేందుకు వైరల్ అవుతున్న పోస్టులో ఉన్న కీవర్డ్స్ ఉపయోగించి గూగుల్‌లో సెర్చ్ చేయడం జరిగింది. 'ప్రధానమంత్రి శ్రమయోగి మాన్‌ధన్ యోజన' పథకం గురించి శోధించగా.. mandhan.in/shramyogi అనే వెబ్సైట్ లింక్ ఓపెన్ అయ్యింది. ఇది కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఈ పథకాన్ని అమలు చేస్తోంది.
అసంఘటిత కార్మికులకు వృద్ధాప్యంలో రక్షణ కల్పించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం. ఇది ఒక పింఛను పథకం. 18 నుంచి 40 యేళ్ల మధ్య వయస్సు వాళ్లు ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. 15వేలలోపు నెలవారీ ఆదాయం ఉన్నవాళ్లు ఈ పథకానికి అర్హులవుతారు. 60యేళ్ల వయసు నిండిన వాళ్లకు నెలకు రూ.3వేల రూపాయలు పెన్షన్ కేంద్రప్రభుత్వం చెల్లిస్తుంది.
ఇదే అంశంపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో - (పీఐబీ) ఫ్యాక్ట్‌చెక్ టీమ్ కూడా క్లారిటీ ఇచ్చింది. ఇది తప్పుడు ప్రచారం అని కొట్టిపారేసింది.
एक ऑनलाइन फॉर्म भरने पर प्रधानमंत्री मानधन योजना के तहत केंद्र सरकार 18 से 40 साल की उम्र के लोगों को हर महीने 1800 रुपए दे रही है।#PIBFactCheck
▶️यह दावा फ़र्ज़ी है।
▶️यह एक पेंशन योजना है। लाभार्थियों को 60 साल की उम्र के बाद ही पेंशन मिलेगी।🔗https://t.co/B0pgspTkpw pic.twitter.com/Wa2UdAQ0so
— PIB Fact Check (@PIBFactCheck) February 28, 2022
ప్రచారం :
ప్రధానమంత్రి శ్రమయోగీ మాన్‌ధన్ యోజన కింద రూ.1800 కేంద్రం ఆర్థికసాయం చేస్తోంది. 18 నుంచి 40 యేళ్ల మధ్య ఉన్నవాళ్లు అర్హులు.
వాస్తవం :
ఇది తప్పుదోవ పట్టిస్తున్న సమాచారం. వాస్తవానికి ఇది కేంద్రప్రభుత్వ పెన్షన్ పథకం. అసంఘటిత కార్మికులకోసం రూపొందించినది. 60యేళ్లు పైబడిన వృద్ధులకు నెలకు రూ.3000 పెన్షన్ అందించే పథకం.
Also Read: Pepaid Recharge Plans: ఎయిర్టెల్, వి, జియోల్లో.. రూ.200 లోపు బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ ఇవే..!
Also Read: Radhe Shyam LIVE Updates: 'రాధేశ్యామ్' మినిట్ టూ మినిట్ అప్డేట్.. లైవ్ అప్డేట్స్ అండ్ రివ్యూ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Facebook , Twitterమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి