/telugu/photo-gallery/good-news-employees-and-students-tomorrow-schools-and-govt-office-holiday-in-telangana-rv-180844 Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు 180844

Revanth Reddy-Jagga Reddy: ఉప్పు-నిప్పుల్లా ఉండే రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి ఒక్కచోట చేరారు. ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకుని ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఇద్దరు కలిసి సుమారు 20 నిమిషాల పాటు మాట్లాడుకున్నారు. భేటీ అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తామెప్పుడూ విడిపోలేదని పేర్కొన్నారు. ఈ ఇద్దరి భేటీకి అసెంబ్లీలోని సీఎల్పీ కార్యాలయం వేదికైంది. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండటంతో రేవంత్ రెడ్డి సీఎల్పీ కార్యాలయానికి వచ్చారు. ఆ సమయంలో అక్కడే ఉన్న జగ్గారెడ్డి రేవంత్‌ను పలకరించి మాట్లాడారు. కొంతకాలంగా రేవంత్ రెడ్డిపై తీవ్ర అసంతృప్తిని, ధిక్కారాన్ని వినిపిస్తున్న జగ్గారెడ్డి తాజాగా ఆయనతో భేటీ అవడం చర్చనీయాంశంగా మారింది.

ఇద్దరి మధ్య భేటీలో ఇటీవల సీఎం కేసీఆర్ చేసిన ఉద్యోగ నోటిఫికేషన్ల ప్రకటనతో పాటు పలు అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. తాజా భేటీతో రేవంత్‌కు, జగ్గారెడ్డికి మధ్య గ్యాప్ ఇక తొలగిపోయినట్లేనా అన్న చర్చ జరుగుతోంది. రేవంతే జగ్గారెడ్డిని దారికి తెచ్చుకున్నారా.. లేక జగ్గారెడ్డే ఒక మెట్టు దిగారా అన్నది తెలియదు కానీ.. మొత్తానికి ఈ ఇద్దరి కలయిక పట్ల కాంగ్రెస్ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఈ నెల 21న సంగారెడ్డిలో భారీ సభ ఏర్పాటు చేసి తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని చెప్పిన జగ్గారెడ్డి.. అందుకు ఇంకా వారం రోజులు ఉండగానే ఇలా రేవంత్‌తో భేటీ అవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీన్నిబట్టి జగ్గారెడ్డి ఇక పార్టీ మారే అవకాశం ఉండకపోవచ్చునని అంటున్నారు.

రెండు వారాల క్రితం జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధపడిన సంగతి తెలిసిందే. కానీ పలువురు కాంగ్రెస్ పెద్దల జోక్యంతో తన నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. కొద్ది రోజుల పాటు వేచి చూశాక తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని చెప్పారు. పార్టీలో తనకు సరైన గుర్తింపు, ప్రాధాన్యం దక్కట్లేదని.. పార్టీ నాయకత్వం ఏకపక్ష పోకడలను అనుసరిస్తోందని జగ్గారెడ్డి బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. జగ్గారెడ్డి రాజీనామాకు సిద్ధపడటంతో పార్టీలో తీవ్ర కలకలం రేగింది. ఎట్టకేలకు జగ్గారెడ్డి తాజాగా రేవంత్ రెడ్డితో భేటీ అవడంతో ఇక ఆయన అలక వీడినట్లేనన్న వాదన వినిపిస్తోంది. 

Also Read: AP Cabinet Expansion: సస్పెన్స్‌కు తెర.. కేబినెట్ విస్తరణపై క్లారిటీ ఇచ్చేసిన సీఎం జగన్...

Also Read: Bank Scam: జగిత్యాల యూనియన్ బ్యాంకులో వెలుగుచూసిన స్కామ్... భారీగా నగదు కాజేసిన మేనేజర్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేయండి

Section: 
English Title: 
tpcc chief revanth reddy and mla jagga reddy meets at clp in assembly
News Source: 
Home Title: 

Revanth Reddy-Jagga Reddy: అనూహ్యం.. రేవంత్, జగ్గారెడ్డి భేటీ... ఇద్దరి మధ్య 20ని. పాటు చర్చలు..

Revanth Reddy-Jagga Reddy: అనూహ్యం.. రేవంత్, జగ్గారెడ్డి భేటీ... ఇద్దరి మధ్య 20ని. పాటు చర్చలు..
Caption: 
Revanth Reddy-Jagga Reddy:
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Highlights: 

కాంగ్రెస్‌లో అనూహ్య పరిణామం

రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి భేటీ

కొంతకాలంగా ఉప్పు నిప్పుల్లా ఇద్దరు

Mobile Title: 
Revanth Reddy-Jagga Reddy: అనూహ్యం.. రేవంత్, జగ్గారెడ్డి భేటీ..
ZH Telugu Desk
Publish Later: 
No
Publish At: 
Friday, March 11, 2022 - 17:37
Request Count: 
112
Is Breaking News: 
No