KCR Action Plan: మరోసారి పోరుబాట పట్టనున్న కేసీఆర్.. ఢిల్లీకి పయనమవనున్న తెలంగాణ సీఎం

పంజాబ్ రాష్ట్ర తరహాలో FCI ద్వారా వరి ధాన్యాన్ని సేకరించాలని మరోసారి సీఎం కేసీఆర్ కేంద్ర మంత్రులతో చర్చల ద్వారా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ శాసన సభాపక్ష సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు సమాచారం. 

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 21, 2022, 01:20 PM IST
  • యాసంగిలో పండిన ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని టీఆర్ఎస్ డిమాండ్
  • కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు దిశగా సీఎం కేసీఆర్
  • తెలంగాణ భవన్‌లో సమావేశం అనంతరం ఢిల్లీకి వెళ్లనున్న సీఎం కేసీఆర్
KCR Action Plan: మరోసారి పోరుబాట పట్టనున్న కేసీఆర్.. ఢిల్లీకి పయనమవనున్న తెలంగాణ సీఎం

KCR Action Plan: ఎన్డీఎ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై టీఆర్ఎస్ పోరుకు రెడీ అవుతోంది. యాసంగిలో పండిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని టీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. పంజాబ్ రాష్ట్ర తరహాలో FCI ద్వారా వరి ధాన్యాన్ని సేకరించాలని మరోసారి సీఎం కేసీఆర్ పోరు బాట చేయనున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు, పార్లమెంట్‌లో నిరసనలు, ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులతో చర్చల ద్వారా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేసేందుకు సిద్ధమైంది. 

ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులతో భేటీ అయ్యేందుకు సీఎంవో పర్మిషన్ కోరింది. తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ శాసన సభాపక్ష సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు సమాచారం. కేంద్రంపై చేపట్టే పోరు బాట కార్యచరణపై ఈ భేటీలో నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ఈ సమావేశానికి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ ఛైర్మన్‌లు, జిల్లా అధ్యక్షులు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, డీసీసీబీ, డీసీఎంఎస్‌ల అధ్యక్షులు, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షులు, కార్పొరేషన్ ఛైర్మెన్‌లు సమావేశానికి హాజరయ్యారు.

కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన, నిరసన, ధర్నాలకు రూపకల్పన చేయనున్నట్లు తెలుస్తోంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశం అనంతరం.. సీఎం, మంత్రుల బృందం ఢిల్లీ బయలుదేరనుంది. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులను కలిసి ధాన్యం కొనుగోలు చేయాలని కోరనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా జరిగే ఆందోళనలకు అనుగుణంగా లోక్‌సభ, రాజ్యసభలో టీఆర్ఎస్ ఎంపీలు నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. 

తెలంగాణలో యాసంగిలో పండిన 50 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం కొనుగోళ్లు అత్యవసరం కాగా.. వానాకాలానికి సంబంధించిన 5.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కూడా నిల్వ ఉంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వరి కోతలు జరుగుతుండగా.. వారం పది రోజుల్లో గ్రామాల్లో ధాన్యం రాశులు పోటెత్తునున్నాయి. ఈ తరుణంలోనే ధాన్యం కొనుగోళ్లపై టీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై పోరుబాటకు సిద్ధమైంది. తెలంగాణ భవన్‌లో సమావేశం ముగిసిన అనంతరం సీఎం కేసీఆర్, మంత్రులు నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, సీఎస్ సోమేశ్ కుమార్ ఇతర అధికారుల బృందం ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లనున్నారు.

Also Read: KGF Chapter 2: మీరు అతనికి అడ్డు నిలబడకండి సార్.. 'తూఫాన్' వచ్చేసింది!!

Also Read: Pegasus in Ap Assembly: అసెంబ్లీలో పెగసస్ అంశంపై చర్చ, టీడీపీని ఇరుకునపెట్టే వ్యూహం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News