ICC Womens World Cup 2022: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో టీమ్ ఇండియా సెమీస్ ఆశలు సజీవమయ్యాయి. మిథాలీ సేన అనూహ్యంగా బంగ్లాదేశ్‌పై భారీ విజయం సాధించి అందర్నీ ఆశ్చర్యపర్చింది.
ఐసీసీ మహిళల ప్రపంచకప్ క్రికెట్ టోర్నీలో సెమీస్‌కు చేరాలంటే గెలవక తప్పని మ్యాచ్ ఇది. బంగ్లాదేశ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో టీమ్ ఇండియా 6 వికెట్ల నష్టానికి కేవలం 229 పరుగులు మాత్రమే సాధించింది. యస్తికా భాటియా 50 పరుగులు చేయగా, షెఫాలీ వర్మ 42 పరుగులు సాధించింది. ఓపెనర్ మంథాన అంతర్జాతీయ క్రికెట్‌లోని మూడు ఫార్మట్లలో కలిపి 5 వేల పరుగులు పూర్తి చేసింది. లక్ష్యం తక్కువ కావడంతో టీమ్ ఇండియా గెలుపు దాదాపు అసాధ్యమనుకున్నారంతా. అయితే మహిళా బౌలర్ల ధాటి ముందు బంగ్లదేశ్ బ్యాటర్లు చేతులెత్తేశారు. హోమిల్టన్ వేదికగా సాగిన ఈ మ్యాచ్‌లో 110 పరుగుల తేడాతో భారీ విజయం అందుకుంది ఇండియా.
టార్గెట్ ఛేందించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్ టీం 25 ఓవర్లు ముగిసే సరికి 5 వికెట్ల నష్టానికి కేవలం 69 పరుగులు చేసింది. 15 పరుగులకే రెండవ వికెట్ కోల్పోయింది. ఇక వరుసగా భారత బౌలర్లు బంగ్లా వికెట్లు కూల్చే పనిలో పడ్డారు. 40.3 ఓవర్లు ముగిసేసరికి 119 పరుగులకే బంగ్లాదేశ్ ఆలవుట్ అయింది. భారత బౌలర్లలో స్నేహ్ రాణా అత్యధికంగా 4 వికెట్లు తీయగా..ఝులన్ గోస్వామి రెండు వికెట్లు పడగొట్టింది. రాజేశ్వరీ గైక్వాడ్ 1 వికెట్ తీయగా.పూజా వస్త్రాకర్ 2 వికెట్లు, పూనమ్ యాదవ్ 1 వికెట్ తీశారు. హాఫ్ సెంచరీ చేసిన యస్తికా భాటియాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
Also read: IPL 2022 New Rules: ఐపీఎల్ ఎలా జరగనుంది..ఏయే మార్పులు చోటుచేసుకుంటున్నాయి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook