Electricity Demand in Telangana: తెలంగాణలో విద్యుత్ డిమాండ్ పీక్స్‌కి చేరింది. తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక విద్యుత్ డిమాండ్ నమోదైంది. రాష్ట్రంలో శనివారం (మార్చి 26) 13,742 మెగావాట్ల పీక్ డిమాండ్ నమోదైనట్లు ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు వెల్లడించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఇదే పీక్ విద్యుత్ డిమాండ్‌గా తెలిపారు.
మున్ముందు రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉందని... పీక్ విద్యుత్ డిమాండ్ 14,500 మెగావాట్ల వరకు నమోదు కావొచ్చునని ప్రభాకర్ రావు పేర్కొన్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోనూ విద్యుత్ వినియోగం భారీగా పెరిగిందన్నారు. గతేడాది జీహెచ్ఎంసీ పరిధిలో విద్యుత్ డిమాండ్ 55 మిలియన్ యూనిట్లు దాటలేదని... కానీ ఈ ఏడాది మార్చిలోనే 65 మిలియన్ యూనిట్స్ డిమాండ్ ఏర్పడిందని తెలిపారు.
తెలంగాణలో ఇటీవలే విద్యుత్ చార్జీలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. 19 శాతం మేర విద్యుత్ చార్జీల పెంపునకు డిస్కంలు ప్రతిపాదించగా... 14 శాతం పెంపునకు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో గృహ అవసరాలకు వినియోగించే విద్యుత్ చార్జీలపై యూనిట్‌కు 40 పైసల నుంచి 50 పైసల వరకు పెరగనుంది. అలాగే, పారిశ్రామిక అవసరాలకు వినియోగించే విద్యుత్‌పై యూనిట్‌కు రూ.1 మేర పెరగనుంది. పెరిగిన చార్జీలు ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానున్నాయి.
Also read: Indian Exports: 2021-22లో భారత స్మార్ట్ఫోన్ల ఎగుమతులు 83 శాతం జంప్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook