Pancard Aadhaar Card Link: పాన్ ఆధార్ నెంబర్ అనుసంధాన గడువు మరోసారి పెంచే అవకాశాలు కన్పిస్తున్నాయి. వినియోగదారుల్ని దృష్టిలో ఉంచుకుని గడువు పెంచాల్సిందిగా సెబీకు విజ్ఞప్తులు అందాయి.
మీ మీ పాన్‌కార్డు-ఆధార్ కార్డు అనుసంధానం చేశారా లేదా..ఒకవేళ చేయకపోతే ఇది మీ కోసమో. గడువు మరోసారి పెంచే అవకాశాలు కన్పిస్తున్నాయి. మార్చ్ 31 గడువు తేదీలా ఉంది. ఆ తేదీలోగా అనుసంధానం చేయకపోతే.. పదివేల జరిమానా విధించి.మళ్లీ పాన్‌కార్డు యాక్టివేట్ చేసుకోవల్సి వస్తుంది. ఇప్పటికే పాన్ ఆధార్ కార్డు అనుసంధానం గడువు చాలా సార్లు పొడిగించింది ప్రభుత్వం. మరోసారి పొడిగిస్తుందనే స్పష్టత లేదు. అందుకే ఈసారైనా త్వరగా అనుసంధానం చేసుకుంటే మంచిది.
ఇన్వెస్టర్లు పాన్‌కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేసుకునేందుకు సమయం మరింత ఇవ్వాలని క్యాపిటల్ మార్కెట్ కంట్రోల్ ఆర్గనైజేషన్..సెబీని కోరింది. ఇప్పటికీ చాలామంది పాన్‌కార్డు ఆధార్ కార్డు లింక్ చేయకపోవడం వల్ల..ట్రేడ్ చేయలేకపోతున్నారని వివరించింది. రెండూ అనుసంధానం కాకపోవడం వల్ల..ట్రేడింగ్ ఆగిపోవడమే కాకుండా అందరి డీమ్యాట్ ఖాతాల్ని సస్పెండ్ చేయాల్సి ఉంటుందని ఏఎన్ఎం వెల్లడించింది.ఆదార్‌తో లింక్ చేయని కారణంగా క్లైయింట్ ఖాతాల్ని నిలిపివేస్తే మార్కెట్‌పై ప్రభావం పడుతుందని ఏఎన్ఎం తెలిపింది. కనీసం ఆరు నెలలపాటు గడువు పెంచాలని కోరింది.
Also read: Viral news: డ్రీమ్ బైక్ కొనేందుకు తమిళనాడు యువకుడి క్రేజీ ఆలోచన.. పైసా పైసా కూడబెట్టి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook