Hyderabad Drugs Case: హైదరాబాద్ రాడిసన్ బ్లూ హోటల్లో పోలీసులు భగ్నం చేసిన రేవ్ పార్టీకి సంబంధించి విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఫుడ్డింగ్ అండ్ మింక్ పబ్‌లోకి మైనర్లను కూడా అనుమతించినట్లు పోలీసులు గుర్తించారు. నిబంధనల ప్రకారం 21 ఏళ్ల వయసు ఉన్నవారినే పబ్‌కి అనుమతించాల్సి ఉండగా.. అంతకన్నా తక్కువ వయసు వారిని కూడా అనుమతించినట్లు తేల్చారు. ఆదివారం (మార్చి 3) తెల్లవారు జామున పబ్‌పై జరిపిన దాడుల్లో మొత్తం ఆరుగురు మైనర్లు పట్టుబడినట్లు తెలుస్తోంది.
ఇదే డ్రగ్స్ వ్యవహారంలో నటి కుషిత పేరు కూడా బయటకొచ్చింది. అయితే తాను డ్రగ్స్ తీసుకోలేదని... ఏ టెస్టుకైనా సిద్ధమేనని కుషిత ప్రకటించారు. కుషిత ఆధార్ కార్డు ప్రకారం ఆమెకు 20 ఏళ్లు కూడా నిండలేదు. నిబంధనల ప్రకారం 21 ఏళ్లు ఉన్నవారినే పబ్‌కి అనుమతించాలి. తానే తప్పు చేయలేదని చెబుతున్న కుషిత... తగిన వయసు లేకపోయినా పబ్‌కి వెళ్లడం తప్పు కాదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో పబ్ యాజమాన్యం కుషితను ఎలా లోపలికి అనుమతించిందని నిలదీస్తున్నారు. ఇదే విషయంపై ప్రముఖ టీవీ చానెల్ కుషితను ప్రశ్నించగా.. ఆమె సమాధానం దాటవేసే ప్రయత్నం చేశారు.
ఎఫ్ఐఆర్లో నలుగురి పేర్లు :
ఫుడింగ్ అండ్ మింక్ డ్రగ్స్ కేసుకు సంబంధించి పోలీసులు ఎఫ్ఐఆర్లో నలుగురి పేర్లు చేర్చారు. ఇందులో A1గా అనిల్, A2గా అభిషేక్, A3గా అర్జున్, A4గా కిరణ్ రాజ్‌లను పేర్కొన్నారు. ప్రస్తుతం అనిల్, అభిషేక్ చంచల్ గూడ జైల్లో రిమాండులో ఉండగా అర్జున్, కిరణ్ పరారీలో ఉన్నారు. ఈ పబ్‌కి కిరణ్ రాజ్ లీగలైజర్‌గా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో తన భార్యతో కలిసి ఈ పబ్‌ను నిర్వహించిన కిరణ్ రాజ్.. ఆ తర్వాత అభిషేక్, అనిల్‌లకు లీజుకు ఇచ్చినట్లు చెబుతున్నారు.
Also Read: Actress Kushitha: పబ్ ఓపెన్ ఉంది కాబట్టే చిల్ అవడానికి వెళ్లాం... దయచేసి దుష్ప్రచారం వద్దు..
Suresh Raina: ఐపీఎల్ 2020 గుర్తుందిగా.. సురేష్ రైనా లేకుంటే చెన్నై పనైపోయినట్టే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook