IPL LSG vs Delhi: ఐపీఎల్‌లో భాగంగా ఇవాళ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను లక్నో సూపర్ జెయింట్స్ జట్టు స్వల్ప స్కోరుకే కట్టడి చేసింది. ఢిల్లీ మూడు వికెట్లే కోల్పోయినప్పటికీ ధాటిగా ఆడటంలో విఫలమైంది. ఓపెనర్ పృథ్వీ షా మినహా బ్యాట్స్‌మెన్ ఎవరూ దూకుడుగా ఆడలేకపోయారు. ఫలితంగా ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 149 పరుగులే చేయగలిగింది.
ఓపెనర్ పృథ్వీ షా 34 బంతుల్లో 2 సిక్స్‌లు, 9 ఫోర్లతో 61 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కెప్టెన్ రిషబ్ పంత్ 39 (36), సర్ఫరాజ్ ఖాన్ 36 (28) పరుగులు చేశారు. వార్నర్ (4), పావెల్ (3) స్వల్ప స్కోర్లకే ఔటయ్యారు. లక్నో బౌలర్లలో రవి బిష్ణో రెండు వికెట్లు తీయగా గౌతమ్ 1 వికెట్ తీశాడు.
లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఇప్పటివరకూ మూడు మ్యాచ్‌లు ఆడి రెండింట్లో విజయం సాధించగా ఒక మ్యాచ్‌లో ఓడింది. ఢిల్లీ క్యాపిటల్స్ రెండు మ్యాచ్‌లు ఆడి ఒకదాంట్లో విజయం సాధించగా మరో మ్యాచ్‌లో ఆడింది. తాజా మ్యాచ్‌లో గెలుపు ఎవరిని వరిస్తుందో చూడాలి.
1️⃣4️⃣9️⃣ to defend, let's give it all in the second innings 👊🏼#YehHaiNayiDilli | #IPL2022#TATAIPL | #IPL | #DelhiCapitals | #LSGvDC pic.twitter.com/H4R0kXqExW
— Delhi Capitals (@DelhiCapitals) April 7, 2022
Also Read: Hrithik Roshan-Sussanne Khan: హవ్వ.. ఇదెక్కడి లవ్ స్టోరీ.. లవర్స్‌తో మాజీ భార్యాభర్తలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook