Rajasthan vs Gujarat IPL 2022: Hardik Pandya about his Injury: గత 2-3 సంవత్సరాలుగా గాయాల కారణంగా భారత జట్టులోకి వస్తూ పోతున్న స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఇటీవలే పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించిన విషయం తెలిసిందే. ఐపీఎల్ 2022 సీజన్‌కు ముందు వెన్ను నొప్పి నుంచి పూర్తిగా కోలుకుని గుజరాత్ టైటాన్స్ సారథిగా ఎంపికయ్యాడు. ఐపీఎల్ 2022లో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో మునుపటిలా సత్తా చాటుతున్న హార్దిక్.. గురువారం రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మళ్లీ గాయపడ్డాడు.
రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా ఉన్నట్టుండి మైదానం వీడాడు. 18 ఓవర్ వేసిన హార్ధిక్.. కేవలం మూడు బంతులు మాత్రమే వేసి మైదానం నుంచి వెళ్లిపోయాడు. రెండో బంతికే జిమ్మీ నీషమ్ వికెట్ పడగొట్టి మ్యాచ్‌ను గుజరాత్ వైపు తిప్పిన హార్దిక్.. అసౌకర్యంగా ఉండడంతో ఫీల్డ్‌ను విడిచి పెట్టి వెళ్లాడు. మిగితా ఓవర్‌ను విజయ్ శంకర్ పూర్తి చేశాడు. అయితే గజ్జల్లో గాయం కారణంగా తాను మైదానం వీడినట్టు మ్యాచ్ అనంతరం గుజరాత్ టైటాన్స్ సారథి తెలిపాడు. గాయం అంత తీవ్రత చిన్నదే అని చెప్పాడు.
మ్యాచ్ అనంతరం హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ... 'నాకు పెద్ద గాయం కాలేదు. కండరాలు పట్టేయడంతో మైదానం వీడాను. ఇంతసేపు బ్యాటింగ్ చేసి చాలా రోజులైంది. ప్రణాళిక ప్రకారం ఆడాను. గత మ్యాచ్‌లో దాన్ని అమలు చేయలేకపోయాను. నా బ్యాటింగ్ కారణంగా మిగతా ఆటగాళ్లు స్వేచ్చగా ఆడారు. ఇన్నింగ్స్ చివర్లో బ్యాటింగ్‌కు వచ్చి 12 బంతుల్లో 30 పరుగులు చేయడం కష్టం. కానీ నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయడంతో గేమ్‌ను కంట్రోల్ చేయగలుగుతున్నా. కెప్టెన్సీ సరదాగా ఉంది' అని అన్నాడు.
Hope the injury is not serious. #IPL20222 #GTvsRR #RRvGT pic.twitter.com/zLCeivKfkV
— Cricketupdates (@Cricupdates2022) April 14, 2022
గతరాత్రి రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 37 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచులో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ 4 వికెట్లకు 192 పరుగుల భారీ స్కోరు చేసింది. హార్దిక్ పాండ్యా (87 నాటౌట్; 52 బంతుల్లో 8×4, 4×6) చెలరేగగా.. అభినవ్ మనోహర్ (43), డేవిడ్ మిల్లర్ (31 నాటౌట్) బ్యాట్ ఝుళిపించారు. లక్ష్య ఛేదనలో రాజస్థాన్ 9 వికెట్లకు 155 పరుగులే చేసి ఓడింది. జొస్ బట్లర్ (54; 24 బంతుల్లో 8×4, 3×6) టాప్ స్కోరర్. లూకి ఫెర్గూసన్ 3 వికెట్లు పడగొట్టాడు.
Also Read: Sachin Tendulkar: ఆసక్తికరమైన దృశ్యం.. సచిన్ టెండూల్కర్ కాళ్లు మొక్కిన పంజాబ్ కోచ్ (వీడియో)!
Also Read: TG Traffic challan: నేడే లాస్ట్ డేట్- మీ వాహనాలపై పెండింగ్ చలాన్లు చెల్లించారా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook