Jio vs Airtel vs Vi plans: దేశంలో ప్రముఖ టెలీకం కంపెనీలు రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియాలు ఎప్పటికప్పుడు కస్టమర్లను ఆకర్షించేందుకు ప్లాన్స్ ప్రకటిస్తుంటాయి. 3 వందల రూపాయల కంటే తక్కువ ప్లాన్స్ వివరాలు తెలుసుకుందాం..
దేశంలోని అన్ని టెలీకం కంపెనీలు కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్లాన్స్ ప్రకటిస్తుంటాయి. ఇందులో భాగంగా రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియాలు అందించే 3 వందల రూపాయల కంటే తక్కువున్న ప్రీపెయిడ్ ప్లాన్స్ గురించి తెలుసుకుందాం. ఈ ప్లాన్స్‌లో ప్రయోజనాలు కూడా అధికమే. ఏ కంపెనీ ఆఫర్లు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..
జియో నుంచి నెలకు 239 రూపాయల ప్లాన్ చాలా లాభదాయకమైంది. ఇందులో రోజుకు 1.5 జీబీ డేటాతో పాటు అన్ని నెట్వర్క్‌లకు అన్‌లిమిటెడ్ కాలింగ్ , రోజుకు వంద ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు. దీంతోపాటు జియో యాప్స్ సభ్యత్వం కూడా లభిస్తుంది. జియోలోనే 259 రూపాయలకు మరో ప్లాన్ ఉంది. ఇది 30 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. మిగిలినవన్నీ 239 రూపాయల ప్లాన్‌లో లభించేవే. రోజుకు 1.5 జీబీ డేటాతో పాటు అన్‌లిమిటెడ్ కాలింగ్ ఉంటుంది. రోజుకు వంద ఎస్ఎంఎస్‌లు వర్తిస్తాయి.
ఇక ఎయిర్‌టెల్ నుంచి 209 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ ఉంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 21 రోజులు. ఏ నెట్వర్క్‌కైనా సరే అన్‌లిమిటెడ్ కాలింగ్ ఉంటుంది. ప్రతిరోజూ 1 జీబీ డేటాతో పాటు వంద ఎస్ఎంఎస్‌లు ఉంటాయి. అంతేకాకుండా అమెజాన్ ప్రైమ్ మొబైల్ ఎడిషన్ 30 రోజుల ట్రయల్ లభిస్తుంది. ఇక మరో ప్లాన్ 239 రూపాయలది. ఇందులో కూడా రోజుకు 1 జీబీ డేటా, వంద ఎస్ఎంఎస్‌లు, అన్‌లిమిటెడ్ కాలింగ్ ఉంటాయి. వ్యాలిడిటీ 24 రోజులుంటుంది. అమెజాన్ ప్రైమ్ మొబైల్ ఎడిషన్ 30 రోజుల ట్రయల్ ఉంటుంది. ఇక మరో ప్లాన్ 265 రూపాయలు. ఇది 28 రోజుల వ్యాలిడీటీతో వస్తుంది. మిగిలినవన్నీ ఇతర ప్లాన్స్‌తో ఉన్నట్టే వర్తిస్తాయి.
ఇక మరో కంపెనీ వోడాఫోన్ ఐడియా అయితే..199 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ నుంచి ప్రారంభమవుతాయి. ఇందులో రోజుకు 1 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు వంద ఎస్ఎంఎస్‌లు వర్తిస్తాయి. ఇది 18 రోజుల వ్యాలిడీటీతో ఉంటుంది. దీంతోపాటు వోడాఫోన్ ఐడియా మూవీస్ అండ్ టీవీ యాప్ సభ్యత్వం లభిస్తుంది. ఇందులో మరో ప్లాన్ 239 రూపాయలకు. ఇది 24 రోజుల కోసం వర్తిస్తుంది. ఇందులో కూడా రోజుకు వంద ఎస్ఎంఎస్‌లు, 1 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్ ఉంటుంది. ఇక మరో ప్లాన్ 299 రూపాయలు. ఇది 28 రోజులకు వర్తిస్తుంది. ఇందులో రోజుకు 1.5 జీబీ డేటాతో పాటు అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు వంద ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. బింజ్ ఆల్ నైట్, వీకెండ్ డేటా రోల్‌ఓవర్ లాభముంటుంది.
Also read: Todays Gold Rate: స్థిరంగా బంగారం ధర, దేశంలో ఏప్రిల్ 16 ఇవాళ్టి బంగారం ధరలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook