/telugu/photo-gallery/good-news-employees-and-students-tomorrow-schools-and-govt-office-holiday-in-telangana-rv-180844 Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు 180844

Railway Ticket at Post offices: రైలు ప్రయాణీకులకు శుభవార్త. రైల్వే టికెట్ల కోసం ఇకపై రైల్వే స్టేషన్లకే వెళ్లాల్సిన అవసరం లేదు. త్వరలో పోస్టాఫీసుల్లో సైతం రైల్వే టికెట్లు బుకింగ్ చేసుకునే సౌకర్యం కలగనుంది.

రైల్వే టికెట్లు బుక్ చేసుకోవాలంటే ఇప్పటివరకూ ఐఆర్సీటీసీ లేదా నేరుగా స్టేషన్‌కు వెళ్లి బుక్ చేసుకోవడం మాత్రమే తెలుసు. ఇక నుంచి టికెట్ బుకింగ్ కోసం రైల్వే స్టేషన్లకు వెళ్లాల్సిన అవసరం లేదు. పోస్టాఫీసుల్లో సైతం రైల్వే టికెట్ బుకింగ్ సౌకర్యం కలగనుంది. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమే. కేంద్ర రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు.

మధ్యప్రదేశ్‌లోని ఖజురహో స్టేషన్‌ను ప్రపంచస్థాయి స్టేషన్‌గా అభివృద్ధి చేస్తున్న సందర్భంగా ఆయన అక్కడ్నించి మాట్లాడారు. వందే భారత్ రైలు త్వరలో ఖజురహో స్టేషన్‌లో నిలుస్తుందని కూడా చెప్పారు. ఇక నుంచి రైల్వే టికెట్ బుకింగ్ దేశవ్యాప్తంగా ఉన్న 45 వేల పోస్టాఫీసుల్లో కూడా ఉంటుందని చెప్పారు. త్వరలో దేశవ్యాప్తంగా రోడ్ ఓవర్ బ్రిడ్జిలు, రోడ్ అండర్ బ్రిడ్జిలను ముఖ్యమైన ప్రాంతాల్లో నిర్మిస్తామన్నారు. రామాయణ ఎక్స్‌ప్రెస్ వంటి భారత్ గౌరవ్ రైళ్లను త్వరలో ప్రారంభిస్తామన్నారు. ఇక ఎలక్ట్రిఫికేషన్ ప్రక్రియ ఆగస్టు నాటికి పూర్తవుతుందన్నారు. అప్పట్నించి వందే భారత్ రైళ్లు కూడా ప్రారంభం కానున్నాయి.

ఇక ఖజురహో రైల్వే స్టేషన్ గుజరాత్‌లోని గాంధీనగర్, భోపాల్‌లోని రాణి కమలపతి స్టేషన్లలా ప్రపంచస్థాయి స్టేషన్ కానుందని మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. రైతులు సోలార్ పవర్ యూనిట్లు నెలకొల్పుకునేందుకు రైల్వే ఆర్ధిక సహాయం అందిస్తుందన్నారు. వన్ స్టేషన్ వన్ ప్రోడక్ట్ పధకం త్వరలో విస్తరించనున్నామని..ఫలింగా స్థానిక ఉత్పత్తులు అన్ని స్టేషన్లలో అందుబాటులో ఉంటాయన్నారు. ఈ పథకంలో భాగంగా తొలుత వేయి రైల్వే స్టేషన్లను ఎంపిక చేశామన్నారు.

Also read: Corona Fourth Wave: ఢిల్లీలో కరోనా ఫోర్త్‌వేవ్ భయం, ఆదివారం ఒక్కరోజే 517 కొత్త కేసులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Section: 
English Title: 
Indian railways to start railway ticket booking facility at all post offices
News Source: 
Home Title: 

Railway Ticket at Post offices: త్వరలో పోస్టాఫీసుల్లో రైల్వే టికెట్ బుకింగ్

Railway Ticket at Post offices: త్వరలో పోస్టాఫీసుల్లో రైల్వే టికెట్ బుకింగ్ సౌకర్యం
Caption: 
Ashwini Vaishnav ( file photo)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Highlights: 

త్వరలో ప్రపంచస్థాయి రైల్వే స్టేషన్‌గా ఖజురహో రైల్వే స్టేషన్

త్వరలో దేశంలోని 45 వేల పోస్టాఫీసుల్లో రైల్వే టికెట్ బుకింగ్ సౌకర్యం

వెల్లడించిన రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్

Mobile Title: 
Railway Ticket at Post offices: త్వరలో పోస్టాఫీసుల్లో రైల్వే టికెట్ బుకింగ్
Md. Abdul Rehaman
Publish Later: 
No
Publish At: 
Monday, April 18, 2022 - 13:14
Created By: 
Md. Abdul Rehaman
Updated By: 
Md. Abdul Rehaman
Published By: 
Md. Abdul Rehaman
Request Count: 
72
Is Breaking News: 
No