Cancel IPL: ఐపీఎల్ 2022ని క్యాన్సిల్ చేయండి.. డిమాండ్ చేస్తున్న ఆ రెండు జట్ల ఫాన్స్!

Cancel IPL trends on Twitter. ఐపీఎల్ 2022లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అభిమానులు, నెటిజన్లు 'ఐపీఎల్ 2022'ని క్యాన్సిల్ చేయాలని సోషల్ మీడియాలో ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 18, 2022, 06:12 PM IST
  • ఐపీఎల్ 2022ని క్యాన్సిల్ చేయండి
  • డిమాండ్ చేస్తున్న ఆ రెండు జట్ల ఫాన్స్
  • ఆపొద్దని బెంగళూరు ఫాన్స్ ట్వీట్స్
Cancel IPL: ఐపీఎల్ 2022ని క్యాన్సిల్ చేయండి.. డిమాండ్ చేస్తున్న ఆ రెండు జట్ల ఫాన్స్!

Cancel IPL trends on Twitter after Covid 19 positive cases was detected in Delhi Capitals: ఐపీఎల్ 2022లో మరోసారి కరోనా కలకలం రేపింది. మూడు రోజుల క్రితం ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు ఫిజియో ప్యాట్రిక్‌ ఫర్హాట్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా.. తాజాగా ఇద్దరు ఢిల్లీ ప్లేయర్స్ మహమ్మారి బారిన పడినట్లు తెలుస్తోంది. ఆ ఇద్దరి ఆటగాళ్లలో ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండ‌ర్ మిచెల్ మార్ష్‌ ఒకడని సమాచారం. ప్రస్తుతం ఇద్దరు ఢిల్లీ ప్లేయర్స్ ప్రత్యేక క్వారంటైన్‌లోకి వెళ్లారట.

ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టులో ఫిజియో ప్యాట్రిక్‌ ఫర్హాట్‌కు కరోనా సోకడంతో ఆటగాళ్లకు యాంటిజెన్‌ పరీక్షలు చేశారు. ఈ పరీక్షల్లో ఇద్దరికి పాజిటివ్‌గా తేలిందని తెలుస్తోంది. ఇందులో ఓవర్సీస్ ప్లేయర్ మిచెల్ మార్ష్‌ కూడా ఉన్నడట. అయితే వీరికి ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు చేయించాల్సి ఉంది. గాయం కార‌ణంగా ఢిల్లీ జ‌ట్టులో ఆల‌స్యంగా చేరిన మార్ష్.. క‌రోనా సోకిన ఫిజియో ప్యాట్రిక్ ఫర్హాట్‌తో స‌న్నిహితంగా మెలిగిన‌ట్లు తెలుస్తోంది.

ఐపీఎల్ 2022లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అభిమానులు, నెటిజన్లు 'ఐపీఎల్ 2022'ని క్యాన్సిల్ చేయాలని సోషల్ మీడియాలో ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా ముంబై ఇండియన్స్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు ఐపీఎల్ 2022ని రద్దు చేయండి అంటూ ట్వీట్లు చేస్తున్నారు. 6 మ్యాచుల్లో ఓడి పట్టికలో చివరి స్థానంలో ముంబై ఉండగా.. ఐదు మ్యాచుల్లో ఓడిన చెన్నై 9వ స్థానంలో ఉండడమే అందుకు కారణం. 

ఇక ఐపీఎల్ 2022ని మధ్యలో ఆపేస్తే.. నిరసన చేస్తామని కొత్త ఫ్రాంచైజీలు గుజరాత్ టైటాన్స్ మరియు లక్నో సూపర్ జెయింట్స్ అభిమానులు అంటున్నారు. మరోవైపు చెన్నై, ముంబై జట్ల ఓటముల నేపథ్యంలో ఐపిఎల్ ట్రోఫీని గెలవడం ఇదే సరైన సమయం అంటూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులు భావిస్తున్నారు. ఐపీఎల్ 2022ని ఆపొద్దని బెంగళూరు ఫాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు. మొత్తానికి 'ఐపీఎల్ క్యాన్సిల్' అనే హ్యాష్ టాగ్ నెట్టింట ట్రెండింగ్‌లో ఉంది. కరోనా కేసులు నమోదవడంతో ఐపీఎల్ 2021 మధ్యలోనే వాయిదా పడిన విషయం తెలిసిందే. 

Also Read: KGF 2 Collections: వీకెండ్‌ మహిమ.. కేజీఎఫ్‌ చాప్టర్‌ 2కు కలెక్షన్లే కలెక్షన్లు! రెండో సినిమాగా రికార్డు

Also Read: Ravindra Jadeja: నీ అమ్మ అంటూ.. కోపంతో ఊగిపోయిన రవీంద్ర జ‌డేజా (వీడియో)!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News