BJP Leaders Meet: గవర్నర్‌ను కలిసిన బీజేపీ నేతలు.. సర్కారు ఆగడాలు అడ్డుకోవాలని వినతి

BJP Leaders Meet: తెలంగాణ బీజేపీ నేతలు గవర్నర్ తమిళి సైని కలిశారు. ఖమ్మం సాయిగేణేశ్, రామాయంపేట్‌ తల్లీకొడుకుల ఆత్మహత్యపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 20, 2022, 02:08 PM IST
  • తెలంగాణ గవర్నర్‌ను కలిసిన బీజేపీ నేతలు
  • తల్లీకొడుకుల ఆత్మహత్యపై గవర్నర్‌కు ఫిర్యాదు
  • ఘటనపై సీబీఐ విచారణకు డిమాండ్
BJP Leaders Meet: గవర్నర్‌ను కలిసిన బీజేపీ నేతలు.. సర్కారు ఆగడాలు అడ్డుకోవాలని వినతి

BJP Leaders Meet: తెలంగాణ బీజేపీ నేతలు గవర్నర్ తమిళి సైని కలిశారు. ఖమ్మం సాయిగేణేశ్, రామాయంపేట్‌ తల్లీకొడుకుల ఆత్మహత్యపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వ్యవహారశైలిపై గవర్నర్ కు వివరించారు బీజేపీ నేతలు. సాయి గణేష్ ఆత్మహత్య ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని గవర్నర్ ను కోరారు కమలం నేతలు.

తెలంగాణ గవర్నర్ తమిళిసైతో బీజేపీ నేతలు భేటీ అయ్యారు. తెలంగాణ పోలీసులు ప్రభుత్వానికి వత్తాసు పలుకుతూ విపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలను టార్గెట్ చేసి హింసిస్తున్నారని నేతలు ఆరోపించారు. ఖమ్మం, రామాయంపేట్ బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని గవర్నర్‌ను కోరారు.

ఖమ్మం సాయిగణేష్, రామాయంపేట తల్లీకొడుకుల మృతిపై సీబీఐ విచారణ జరిగేలా చూడాలని గవర్నర్‌ను కోరినట్లు బీజేపీ నేతలు తెలిపారు. ప్లాన్ ప్రకారమే టీఆర్ఎస్ నేతలు ప్రత్యర్థులపై కేసులు పెడుతున్నారని వివరించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు.. పోలీసుల సాయంతో ప్రత్యర్థి పార్టీల కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారని తీవ్రంగా ఆరోపించారు. ఖమ్మంలో పోలీసుల సమక్షంలోనే బీజేపీ కార్యకర్తలపై టీఆర్ఎస్ దాడులకు దిగిందన్నారు మాజీ ఎమ్మెల్సీ రాంచందర్రావు. మంత్రి పువ్వాడ అజయ్ రాజీనామా చేయాలని... లేని పక్షంలో మంత్రి అజయ్‌ను బర్తరఫ్ చేసి టీఆర్ఎస్ నైతికతను నిరూపించుకోవాలన్నారు.

ఖమ్మం, రామాయంపేట్ ఘటనలపై జోక్యం చేసుకోవాలని గవర్నర్‌ను కోరినట్లు బీజేపీ ఎమ్మెల్యే రఘనందనరావు తెలిపారు. జరిగింది ఆత్మహత్యలు కావని, టీఆర్ఎస్ ప్రభుత్వ హత్యలని, సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. మంత్రులు, పోలీసుల ముద్దాయిలుగా ఉన్నందున.. బాధితులకు అన్యాయం జరుగుతోందన్నారు రఘునందన్. ఎమ్మెల్యే వనమా కొడుకు పైనా, నిర్మల్ ఘర్షణలపైనా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగే వరకూ పోరాడుతామన్నారు రఘునందన్.

Also Read: Ante Sundaraniki Teaser: అంటే.. అంటే.. అంటే సుందరానికీ!.. ఆ గండాలెక్కువట!

Also Read: AP New Districts: ఆధార్ కార్డుల్లో కొత్త జిల్లాల పేర్లు వచ్చేది అప్పటి నుంచే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News