23 మండలాల్ని కరువు పీడిత మండలాలుగా ప్రకటించిన ఏపీ సర్కార్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా మరో 23 మండలాలను కరువు మండలాల జాబితాలో చేర్చుతున్నట్టు ప్రకటించింది.

Last Updated : Mar 30, 2018, 06:21 PM IST
23 మండలాల్ని కరువు పీడిత మండలాలుగా ప్రకటించిన ఏపీ సర్కార్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా మరో 23 మండలాలను కరువు మండలాల జాబితాలో చేర్చుతున్నట్టు ప్రకటించింది. ఈమేరకు ఏపీ సచివాలయం నుంచి శుక్రవారం ఓ ప్రకటన వెలువడింది. తాజా ప్రకటన అనంతరం ఆంధ్ర ప్రదేశ్ లో మొత్తం కరువు మండలాల సంఖ్య 121కి చేరినట్టయింది. తాజాగా వెలువడిన నోటిఫికేషన్ లో వున్న మండలాల జాబితా ఇలా వుంది. మైలవరం, యర్రగుంట్ల, కమలాపురం, వళ్లూరు, అట్లూరు, సిద్ధవటం, చక్రాయిపేట్, గాలివీడు, శంబేపల్లి, టి సుండుపల్లి, చిట్వేల్, పుల్లంపేట్, ఓబులవారిపల్లె ( కడప జిల్లా), రైల్వే కోడూరు ( కడప జిల్లా), డి హిరేహల్, యాడికి, ఊరకొండ, బెళుగుప్ప, కళ్యాణదుర్గ్, ఎన్ పులకుంట, తనకల్, గండ్లపెంట ( అనంతపురం జిల్లా) వున్నాయి.

ఈ మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాల్సిందిగా సంబంధిత జిల్లాల కలెక్టర్లు పంపించిన సిఫార్సుల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఏపీ సర్కార్ స్పష్టంచేసింది. కరువు పీడిత మండలాల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించనున్నట్టు ఈ సందర్భంగా ఏపీ సర్కార్ తెలిపింది. 

Trending News