Malaika Arora Dating: నేను విడాకులు తీసుకున్నా.. కుర్రాడితో డేటింగ్ చేస్తే తప్పేంటి! హీరోయిన్ ఘాటు రిప్లై

Actress Malaika Arora fires on dating with Arjun Kapoor. ఇటీవల ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న మలైకా అరోరాకు.. మరోసారి డేటింగ్ ప్రశ్న ఎదురైంది. దీనిపై స్పందించిన బాలీవుడ్ హాట్ భామ ఫైర్ అయ్యారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 22, 2022, 09:53 PM IST
  • నేను విడాకులు తీసుకున్నా
  • కుర్రాడితో డేటింగ్ చేస్తే తప్పేంటి
  • హీరోయిన్ ఘాటు రిప్లై
Malaika Arora Dating: నేను విడాకులు తీసుకున్నా.. కుర్రాడితో డేటింగ్ చేస్తే తప్పేంటి! హీరోయిన్ ఘాటు రిప్లై

Malaika Arora Slams Netizens and Media on Dating with Arjun Kapoor: బాలీవుడ్ లవ్‏బర్డ్స్ మలైకా అరోరా, అర్జున్ కపూర్ పీకల్లోతు ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. గత నాలుగు సంవత్సరాల పాటు వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారు. అర్జున్-మలైకా త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ బీటౌన్‌లో ఎప్పటినుంచో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే అర్జున్‌ వయసు 36 కాగా.. మలైకాకు 48 ఏళ్లు. వీళ్లిద్దరి మధ్య వయసు తేడా 12 ఏళ్లు. ఈ కారణంగా వీరిద్దరి రిలేషన్‌ విషయంలో తరచూ ట్రోల్స్‌ వస్తున్నాయి. 

మలైకా అరోరా, అర్జున్ కపూర్ కలిసి బయటకి వచ్చినప్పుడు లేదా మీడియా సమావేశంలో పాల్గొనపుడు వారి వయసు వ్యత్యాసంపై ప్రశ్నలు ఎదురువుతూనే ఉంటాయి. అందుకు ఈ బాలీవుడ్ లవ్‏బర్డ్స్ సమాధానం ఇస్తూ వస్తున్నారు. అయితే ఇటీవల ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న మలైకా అరోరాకు.. మరోసారి అదే ప్రశ్న ఎదురైంది. దీనిపై స్పందించిన బాలీవుడ్ హాట్ భామ ఫైర్ అయ్యారు. ప్రతిసారి ఇదే ప్రశ్న ఎందుకు అడుగుతారని, ఈ విషయాన్ని ఎందుకు పెద్దదిగా చూస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. కుర్రాడితో డేటింగ్ చేస్తే తప్పేంటి? అని కూడా ప్రశ్నించారు. 

మలైకా అరోరా హలో మ్యాగజైన్‌తో మాట్లాడుతూ... 'మహిళలు విడాకుల తీసుకున్న తర్వాత జీవితాన్ని గడపడం చాలా ముఖ్యం. స్త్రీ సంబంధాల పట్ల ప్రస్తుతం ద్వేషపూరిత విధానం ఉంది. ఒక మహిళ యువకుడితో డేటింగ్ చేయడంను పెద్ద అపరాధంగా భావిస్తున్నారు. ఓ బలమైన మహిళ పురోగతి కోసం ఎంతో కష్టపడుతుంది. ప్రతిరోజూ దృఢంగా ఉండాలనుకుంటుంది. అంతేకాదు సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది' అని అన్నారు. 

'నేను నా తల్లిలా జీవించాలనుకుంటున్నాను. ఆమె స్వతంత్రురాలు. చిన్నప్పటినుంచి నన్ను కూడా అలాగే పెంచింది. నాకు ఆమె దైర్యం, శక్తి వచ్చాయి. ఎల్లప్పుడూ స్వతంత్రంగా, నచ్చిన జీవితాన్ని గడపాలని నాకు చెప్పింది. నేను ఆమెకు ప్రతి బింబం. నేను విడాకులు తీసుకున్నాక  అర్జున్ కపూర్‌తో డేటింగ్ ప్రారంభించా. మహిళలు యువకులతో డేటింగ్ చేస్తే.. ఎందుకు ఈ సమాజం ఎత్తి చూపిస్తుంది. బ్రేకప్ లేదా విడాకుల తర్వాత మహిళలు జీవితం తమకిష్టమైనట్లు బ్రతకకూడదా?. 12 ఏళ్ల చిన్నవాడైన కుర్రాడితో డేటింగ్ చేస్తే తప్పేంటి?. అది నా పర్సనల్ విషయం. ప్రేమకు వయసుతో సంబంధం లేదు' అంటూ మలైకా ఘాటుగా స్పందించారు. 

Also Read: Allu Arjun on KGF 2: కేజీఎఫ్‌ 2పై అల్లు అర్జున్‌ ప్రశంసలు.. పుష్పరాజ్‌ రివ్యూ ఇదే!

Also Read: Aditi Rao Hydari Pics: కోహినూర్ డైమండ్‌లా మెరిసిపోతున్న అదితిరావు హైదరీ!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x