చిరంజీవికి గర్వకారణం: మోహన్ బాబు

రామ్‌చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 'రంగస్థలం' థియేటర్లలో అదరగొడుతోంది.

Last Updated : Apr 5, 2018, 08:56 AM IST
చిరంజీవికి గర్వకారణం: మోహన్ బాబు

రామ్‌చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 'రంగస్థలం' థియేటర్లలో అదరగొడుతోంది. ఇటు ఆంధ్ర నుంచి అటు అమెరికా వరకు ప్రతి చోట ఈ చిత్రం వసూళ్ల వర్షం కురిపిస్తోంది. మరోవైపు ఈ చిత్రంపై పలువురు సినీ ప్రముఖులు.. సినిమాపై తమ అభిప్రాయాన్ని తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా డైలాగ్ కింగ్ మోహన్ బాబు రంగస్థలంపై కామెంట్లు చేశారు.

రంగస్థలం చిత్రానికి అన్నిచోట్లా పాజిటివ్ టాక్ రావడం ఎంతో సంతోషంగా ఉందని హీరో మోహన్ బాబు వ్యాఖ్యానించారు. ఈ చిత్రంలో అద్భుతంగా నటించిన రామ్‌చరణ్ సహా అందరికీ అభినందనలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. ఏ తండ్రికైనా పిల్లల విజయం కంటే సంతోషం మరొకటి ఉండదని, ఇప్పుడు తన స్నేహితుడు చిరంజీవి కూడా రాంచరణ్ విషయంలో గర్వపడుతుంటాడని ఆశిస్తున్నట్లు మోహన్ బాబు ట్విట్టర్‌లో తెలిపారు.

' 'రంగస్థలం' గురించి అన్ని చోట్ల పాజిటివ్ టాక్‌ వింటున్నాను. త్వరలోనే మూవీని చూస్తాను. చిట్టిబాబుకు అలాగే ఈ చిత్రంలో భాగమైన అందరికీ కంగ్రాట్స్. ఏ తండ్రికైనా తన పిల్లల విజయం కంటే మించిన సంతోషం మరొకటి ఉండదు. ఇప్పుడు నా స్నేహితుడు చిరంజీవి కూడా అలాగే గర్వపడుతున్నాడని భావిస్తున్నా" అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు మోహన్‌బాబు.

రామ్ చరణ్ కెరీర్ లోనే 'రంగస్థలం' బెస్ట్ నంబర్స్ రికార్డు చేస్తోంది. మొదటి రోజు నుంచి కంప్లీట్ పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న ఈ మూవీ, ఫస్ట్ వీకెండ్ నాటికి దిమ్మతిరిగే కలెక్షన్లు సాధించింది. ఓవర్సీస్‌లో 3 మిలియన్ డాలర్ క్లబ్ క్రియేట్ చేస్తుందనే అంచనాలు ఇప్పటికే మొదలవ్వగా.. ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ వీకెండ్ లో ఏకంగా 38 కోట్ల రూపాయల షేర్ సాధించి, ట్రేడ్ ను సర్ ప్రైజ్ చేస్తోంది.

Trending News