Flipkart Big Saving Days: కస్టమర్ల కోసం ఫ్లిప్‌కార్ట్ 'బిగ్ సేవింగ్ డేస్ సేల్' ప్రారంభించింది. ఇవాళ్టి (మే 3) నుంచి ఈ నెల 8 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉండనుంది. 'బిగ్ సేవింగ్ డేస్ సేల్' కింద స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై భారీ తగ్గింపును పొందవచ్చు. సెల్ ఫోన్లలో యాపిల్ ఐఫోన్ 12పై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి. రూ.65 వేలు విలువ చేసే ఈ స్మార్ట్ ఫోన్‌ని ఈఎంఐలో నెలకు కేవలం రూ.1700కే పొందవచ్చు.
ఐఫోన్ 12పై భారీ డిస్కౌంట్ :
64 జీబీ స్టోరేజ్‌తో కూడిన ఐఫోన్ 12 ధర రూ. 65,900. అయితే ఫోన్ ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో దీన్ని రూ. 51,999కే కొనుగోలు చేయవచ్చు. అంటే ఫోన్ పై రూ.13901 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాదు, ఈ ఐఫోన్ కొనుగోలుకు మీరు క్రెడిట్ కార్డు వాడటంతో పాటు ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఉపయోగించినట్లయితే మరింత చౌక ధరకే ఈ ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు.
ఎక్స్చేంజ్ ఆఫర్‌తో భారీ తగ్గింపు :
ఐఫోన్ 12 కొనుగోలుకు ఎస్బీఐ క్రెడిట్ కార్డు వాడినట్లయితే మీకు రూ.2 వేల వరకు అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. అంటే డిస్కౌంట్ మొత్తం పోను ఐఫోన్ 12 మీకు రూ.49,999కే లభిస్తుంది. ఒకవేళ మీరు ఎక్స్చేంజ్ ఆఫర్ కింద మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను ఇచ్చినట్లయితే... రూ.13 వేల వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో ఐఫోన్ 12 రూ.36,999కే లభిస్తుంది.
ఈఎంఐలో నెలకు కేవలం రూ.1778కే ఐఫోన్ :
మీరు హెచ్‌డిఎఫ్‌సి కార్డ్‌తో ఈఎంఐలో ఐఫోన్ 12 కొనుగోలు చేసినట్లయితే నెలకు రూ.1778కే దీన్ని సొంతం చేసుకోవచ్చు. 36 నెలల పాటు ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. ఈఎంఐలో ఫోన్ కొనాలనుకునేవారికి ఇది బెస్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు.
Also Read: Rahul Night Club Video:రాహుల్ నైట్ క్లబ్ వీడియో.. తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.