Spices To Avoid In Summer: కూర రుచిని పెంచడంలో మసాలా దినుసులు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అయితే వేసవిలో కొన్ని మసాల దినుసులను (Spices To Avoid In Summer) తక్కువ పరిమాణంలో తీసుకుంటే మంచిది. అవి ఎక్కువ పరిమాణంలో తీసుకోవడం వల్ల శరీరానికి హాని చేస్తాయి. ఇంతకీ ఆ మసాలు దినుసులేంటి? అవి తీసుకోవడం వల్ల వచ్చే సమస్యలేంటో తెలుసుకుందాం.
పసుపును అతిగా ఉపయోగించవద్దు
పసుపు (Turmeric) శరీరానికి మంచిదని అందరికీ తెలుసు. కానీ దానిని అధిక పరిమాణంలో ఉపయోగిస్తే...కొన్ని సమస్యలు ఎదుర్కొవల్సి వస్తుంది. ముఖ్యంగా మహిళలు పీరియడ్స్ సమయంలో పసుపును పరిమిత పరిమాణంలో ఉపయోగించాలి. అది అధికంగా వినియోగించడం వల్ల ఎక్కువ రక్తస్రావం అయ్యే అవకాశం ఉంది.
దాల్చిన చెక్క వాడకాన్ని తగ్గించండి
దాల్చిన చెక్క (Cinnamon) అధికంగా ఉపయోగించడం వల్ల నోటిలో బొబ్బలు ఏర్పడతాయి. అయితే దీనిని ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తపోటు తగ్గుతుంది.
నల్ల మిరియాలు
నల్ల మిరియాలు (Black pepper) కూరగాయలలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇది బరువును కూడా తగ్గిస్తుందని అందరికీ తెలుసు. అయితే ఒక వ్యక్తికి రక్తం గడ్డకట్టే సమస్య ఉంటే, నల్ల మిరియాలు తినకూడదు.
తులసి
తులసిని (Basil) కూడా తక్కువగా ఉపయోగించాలి. దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తపోటు తగ్గుతుంది. అయితే దీనిని ఎక్కువగా తీసుకోవడం వల్ల మహిళల్లో సంతానోత్పత్తిని ప్రభావితం చేసే అవకాశం ఉంది.
Also Read: Ajwain For Diabetes: వాముతో డయాబెటిస్ కు చెక్ పెట్టండి ఇలా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook