Problems For Colonies: డ్రైనేజ్ ట్రంక్ లైన్ పనులు ఆ కాలనీలవాసులకు శాపంగా మారాయి. తాగటానికి నీరు లేక.. డ్రైనేజీ నీరు ఇళ్ల మధ్యకు చేరి పిల్లలు, పెద్దలు అనారోగ్యం పాలవుతున్నారు. ఇదెక్కడో మారుమూల ప్రాంతం విషయం కాదు. మెట్రో నగరం హైదరాబాద్ లోని ఎల్‌బినగర్ నియోజవర్గం హయత్ నగర్ డివిజన్‌లోని కాలనీల్లో పరిస్థితి ఇది.
అధికారులు, పాలకుల నిర్లక్ష్యం హయత్ నగర్ డివిజన్ తిరుమల కాలనీ, మజ్దూర్ ఆర్టీసీ కాలనీల ప్రజలకు శాపంగా మారుతోంది. దాదాపు 3 నెలలుగా అక్కడి ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. బాతుల చెరువు నుంచి వరద నీరు పోవడానికి తిరుమల కాలనీ, మజ్దూర్ అర్ టి సి కాలనీ మీదుగా బంజారా కాలనీ వరకు ట్రంక్ లైన్ నిర్మిస్తున్నారు. దీనికి ఇరు వైపులా మంచినీటి లైన్, డ్రైనేజ్ పైప్ లైన్ పనులు పూర్తి చేస్తున్నారు. ప్రభుత్వం SNDP ప్రాజెక్ట్ కింద 10 కోట్ల రూపాయల వ్యయంతో ఈ పనులు చేపట్టింది. అయితే మూడు నెలల క్రితం మొదలైన పనులు నత్తనడకన సాగుతున్నాయి.
నెల రోజుల నుంచి పనులు ఆగిపోయాయి. దాంతో ఆ కాలనీల ప్రజలు ఇళ్ళ నుండి బయటకి రాలేని పరిస్థితి ఏర్పడింది. డ్రైనేజీ నీరు వచ్చి ఓపెన్ ప్లాట్‌లలోకి చేరడంతో దుర్గంధం వెదజల్లుతోంది. అపరిశుభ్ర వాతావరణం కారణంగా దోమలు పెరిగి స్థానికులు అనారోగ్యం బారినపడుతున్నారు. అధికారులను అడిగితే పనులు అయ్యేవరకు ఇళ్ల నుండి వెళ్ళిపొండి అని నిర్లక్ష్య సమాధానం చెబుతున్నారని స్థానికులు వాపోతున్నారు. ఇటీవల కురిసిన వర్షానికి పరిస్థితి మరంత దారుణంగా మారింది. నిత్యవసరాలు, మందులు తెచ్చుకోలేకపోతున్నామని ఆ కాలనీలవారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మంచినీరు కూడా రాకపోవడం తో కనీసం తాగటానికి నీళ్లు లేక అవస్థలు పడుతున్నారు. ఇప్పుడు నిర్మిస్తున్న ట్రంక్ లైన్ లోనే వాటర్ పైప్ లైన్ ఉండటం.. అందులో డ్రైనేజీ మురుగు నీరు చేరటం తో ఒకవేళ మంచినీటి లైన్ లీక్ అయితే ఏంటి పరిస్థితి అని ప్రశ్నిస్తున్నారు. అదే జరిగితే దాదాపు 2 వేల కుటుంబాలు అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉందని అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు త్వరగా పనులు పూర్తి చేయాలని కోరుతున్నారు.
Also Read:Sri lanka PM Resign: మహిందా రాజపక్సే రాజీనామా.. నిరసనలకు దిగివచ్చిన శ్రీలంక ప్రధాని
Also Read: Leopard alert: పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్ దగ్గర చిరుత హల్‌చల్.. భయాందోళనలో స్థానికులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook