YOUTH BURNT GOVT OFFICIAL : తెలంగాణలో రెవెన్యూ అధికారులపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన మరోసారి కలకలం రేపుతోంది. గతంలో అబ్దుల్లాపూర్ మెట్లో ఎమ్మార్వో విజయపై పెట్రోల్ పోసి కిరాతకంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. ఇదే తరహాలో తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలో ఓ ఘటన జరిగింది.
బీర్పూర్ మండలం తుంగూరు గ్రామంలో విధులు నిర్వర్తిస్తున్న అధికారులపై గంగాధర్ అనే యువకుడు పెట్రోల్‌తో దాడికి పాల్పడ్డాడు. తన ఇంటివైపున్న దారి వివాదస్పదమైంది. ఈ సమస్యను పరిష్కరించాలని బాధితులు కోరిన దృష్ట్యా గ్రామానికి వచ్చిన అధికారులపై నిందితుడు పెట్రోల్ పోశాడు. ఈ క్రమంలో నిప్పంటుకుని ఓ అధికారికి గాయాలయ్యాయి.
దారి వివాదమై గంగాధర్ రోడ్డుకు అడ్డంగా కర్రలు పెట్టాడు. ఈ కర్రలు తొలగించేందుకు ఎస్ఐ, తహసీల్దార్, ఎంపీడీవో గ్రామానికి వెళ్లారు. కర్రలు తొలగించేందుకు వెళ్లిన తహసీల్దార్ మహమ్మద్ ఫరివొద్దీన్, ఎస్ ఐ గౌతమ్, ఎంపీవో రాజులను గమనించిన గంగాధర్ వారిపై పెట్రోల్ చల్లి నిప్పంటించాడు. ఈ దాడిలో ఎంపీడీవో గాయాల పాలయ్యారు. ఆయనను సమీపంలోని జగిత్యాల జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఘటనకు పాల్పడిన నిందితుడు గంగాధర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Also Read - Sajjala on Narayana Arrest : నారాయణ అరెస్టుపై సజ్జల క్లారిటీ
Also Read - Keerthy Suresh Photos: 'సర్కారు వారి పాట' సినిమా ప్రమోషన్స్ కు సిద్ధమైన కళావతి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook