May Month Born: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ప్రతి నెలకు దానికి ఓ ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. క్యాలెండర్ సంవత్సరం ప్రకారం కొన్ని నెలలలో పుట్టిన వారి స్వభావం, భవిష్యత్తు, గుణాలు, కెరీర్, ఇష్టాలు, అయిష్టాలు అన్నీ విభిన్నంగా ఉంటాయి. పుట్టిన నెల, పుట్టిన తేదీ, రాశి ఆధారంగా ఏ వ్యక్తి భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు. అయితే మే నెలలో పుట్టిన వారి స్వభావం గురించి ఈరోజు తెలుసుకుందాం.. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మే నెలలో పుట్టిన వారు చాలా ఆకర్షణీయంగా ఉంటారు. వీరు జీవితంలో ఏది చేయాలని నిర్ణయించుకున్నా.. దానిని తప్పకుండా చేస్తారు. కాబట్టి మే నెలలో పుట్టిన వారి గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం..
వృత్తి పరంగా:
మే నెలలో పుట్టిన వారు చాలా కష్టపడి పనిచేసి జీవితంలో ఉన్నత స్థానానికి ఎదుగుతారు. ఉద్యోగం, వ్యాపార రంగంల్లో చాలా విజయాలు సాధిస్తారు. మే నెలలో జన్మించిన వ్యక్తులు కంప్యూటర్ ఇంజనీర్లు, జర్నలిస్టులు, పైలట్లు, అడ్మినిస్ట్రేటివ్ రంగాల్లో ఉద్యోగాలు సాధించగలుగుతారు. అమ్మాయిల విషయానికొస్తే.. ఫ్యాషన్ రంగంలో చాలా విజయాలు సాధిస్తారు. ఫ్యాషన్‌కి సంబంధించిన పరిశ్రమల్లో రాణిస్తున్నారు.
చూడటానికి ఆకర్షణీయంగా ఉంటారు:
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం..మే నెలలో పుట్టిన వారు చూడటానికి చాలా ఆకర్షణీయంగా, మక్కువతో ఉంటారు. ఈ మాసంలో జన్మించిన వారు చురుకైన తెలివిని కలిగి ఉంటారు. వారు తమ పదునైన బుద్ధి బలంతో ఏ పనిలోనైనా సులభంగా విజయం సాధిస్తారు.
ఈ వ్యక్తులు కళాత్మకత ఎక్కువే:
మే నెలలో జన్మించిన వ్యక్తులు సాహిత్యం, కళల వంటి రంగాల్లో రాణించగలుగుతారు. అంతే కాకుండా ఈ వ్యక్తులు పెయింటింగ్, డ్యాన్స్, పాటల పట్ల ఆసక్తిని కలిగి ఉంటారు.
రొమాంటిక్‌గా ఉంటారు:
ఈ నెలలో జన్మించిన వ్యక్తులు శుక్ర గ్రహం చేత ప్రభావితమవటం వలన వీరు ఎక్కువగా శృంగార స్వభావం కలిగి ఉంటారు.
కోపం మొడితనం కూడా ఎక్కువే..
మే నెలలో జన్మించిన వ్యక్తుల్లో కోపంతో పాటు మొండితనం కూడా ఎక్కువే.. వీరు చాలా త్వరగా కోపానికి గురవుతారు. మే నెలలో జన్మించిన వ్యక్తులు తమ ప్రతికూల అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని శాస్త్రం చెబుతుంది.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ ఊహలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Pandit Sukh Ram Passes Away: కేంద్ర మాజీ మంత్రి పండిట్ సుఖ్ రామ్ కన్నుమూత!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook