Somvati Amavasya 2022: సోమవతి అమావాస్య రోజు వివాహిత స్త్రీలు పొరపాటున కూడా ఇలా చేయొద్దు... చేస్తే భర్తకు కీడు..!

Somvati Amavasya 2022: సోమవారం వచ్చే అమావాస్యే 'సోమవతి అమావాస్య'. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వివాహిత స్త్రీలు ఈ రోజు కొన్ని పనులు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. 

Written by - ZH Telugu Desk | Last Updated : May 17, 2022, 06:00 PM IST
  • సోమవతి అమావాస్య విశేషాలు
  • మే 30న సోమవతి అమవాస్య
  • ఆరోజు వివాహిత స్త్రీలు కొన్ని పనులు ఎట్టి పరిస్థితుల్లోచేయొద్దు
  • ఆ పనులేంటో ఇక్కడ తెలుసుకోండి
Somvati Amavasya 2022: సోమవతి అమావాస్య రోజు వివాహిత స్త్రీలు పొరపాటున కూడా ఇలా చేయొద్దు... చేస్తే భర్తకు కీడు..!

Somvati Amavasya 2022: ఒక సంవత్సరంలో 12 అమావాస్యలు వస్తాయి. ఇందులో సోమవారం వచ్చే అమావాస్యను 'సోమవతి అమావాస్య' అంటారు. సనాతన ధర్మంలో దీని ప్రత్యేకత, ప్రాముఖ్యత గురించి చెప్పబడింది. ఈసారి 'సోమవతి అమావాస్య' మే 30వ తేదీన వస్తోంది. ఈ రోజున మహిళలు ఉపవాస దీక్ష చేస్తారు. అలాగే పూజా క్రతువులు నిర్వహిస్తారు. జ్యోతిష్యం, పంచాంగ శాస్త్రం ప్రకారం ఈ ఏడాది ఇదే చివరి సోమవతి అమావాస్య.

పితృ దోష విముక్తి :

సోమవతి అమావాస్య రోజున (మే 30న) సర్వార్థ సిద్ధి యోగం కూడా ఏర్పడుతోంది. ఈరోజున ఉపవాసం ఆచరించినవారు అపూర్వమైన ఫలితాలు పొందుతారు. ఈరోజున ఉపవాసం, పూజా క్రతువులు నిర్వహించడం ద్వారా పితృ దోషం నుంచి విముక్తి పొందుతారని విశ్వసిస్తారు. తద్వారా ఆ వ్యక్తి గృహ సంబంధిత సమస్యల నుంచి బయటపడి అతని ఇంట్లో సుఖ, సంతోషాలు వెల్లివిరుస్తాయని నమ్ముతారు.

సోమవతి అమావాస్య సమయం :

జ్యేష్ఠ మాస అమావాస్య సోమవారం వస్తుంది కాబట్టి దీనిని సోమవతి అమావాస్య అని పిలుస్తారు. ఈసారి అమావాస్య తిథి మే 29, 2022 మధ్యాహ్నం 02:54 గంటలకు ప్రారంభమై మే 30, 2022 సాయంత్రం 04:59 గంటలకు ముగుస్తుంది. ఉదయతిథి ప్రకారం మే 30న అమావాస్య వస్తుంది.

సోమవతి అమావాస్య రోజు పొరపాటున కూడా ఈ పనులు చేయొద్దు :

హిందూమతంలో సోమవతి అమావాస్యకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈరోజున ఆరాధన, ఉపవాసం, పవిత్ర నదీ స్నానం చేస్తారం. ఈ సంవత్సరం ఇదే చివరి సోమవతి అమావాస్య. సోమవతి అమావాస్య రోజున స్థిరమైన మనస్సుతో, ఏకాగ్రతతో ఉపవాసం ఉండాలి. భక్తి శ్రద్ధలతో దైవాన్ని పూజించాలి. అయితే వివాహిత స్త్రీలు ఈ రోజు చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం...

సోమవతి అమావాస్య రోజు ఎవరి పట్ల అగౌరవంగా వ్యవహరించవద్దు.

ఎవరితోనూ పరుష పదజాలం ఉపయోగించవద్దు.

ఈ రోజు శ్మశాన వాటికకు వెళ్లవద్దు. ఒకవేళ వెళ్తే ప్రతికూల శక్తులు మిమ్మల్ని వెంటాడుతాయి. 

రావి చెట్టు వద్ద దీపం వెలిగించి పూజిస్తే శుభం కలుగుతుంది.

సోమవతి అమావాస్య రోజు బ్రహ్మ ముహూర్తమునే నిద్ర లేచి స్నానం చేయడం మంచిది.

ఇంద్రియ నిగ్రహం పాటించాలి. శృంగారానికి దూరంగా ఉండాలి. మద్యం, మాంసం సేవించరాదు.

అలాగే, అమావాస్య రోజు జుట్టు, గోర్లు కత్తిరించడం మంచిది కాదు. 

పైన చెప్పిన అంశాలను విస్మరించినట్లయితే అశుభం కలుగుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వివాహిత స్త్రీలు ఈ నియమాలు పాటించకపోతే తమ భర్తలకు కీడు జరుగుతుందని చెబుతున్నారు.

(గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ అంచనాలపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

Also Read: Net Banking Tips: పొరపాటున మరొకరి ఖాతాకు మనీ ట్రాన్స్‌ఫర్ చేశారా... ఇలా చేస్తే మీ డబ్బును తిరిగి పొందవచ్చు...   

Also Read: Saroornagar Honour Killing: సరూర్‌నగర్ పరువు హత్య కేసులో సంచలన నిజాలు.. ఫైండ్ మై డివైజ్‌ సాయంతో నాగరాజు హత్య

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News