/telugu/photo-gallery/rain-alert-expected-in-these-4-key-districts-of-telugu-states-imd-weather-alert-issued-rn-180901 AP: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ముఖ్యంగా ఆ 4 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం.. ఐఎండి హెచ్చరిక AP: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ముఖ్యంగా ఆ 4 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం.. ఐఎండి హెచ్చరిక 180901

Jan Dhan Account: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జన్‌ధన్ యోజన గురించి మీకు తెలియని చాలా విషయాలున్నాయి. ఒకవేళ మీకు ఆ ఎక్కౌంట్ లేకపోతే వెంటనే ఓపెన్ చేయండి. అత్యవసరంలో ఎలా ఉపయోగపడుతుందంటే..

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథకాలు, విధానాల్లో ఒకటి జన్‌ధన్ యోజన ఎక్కౌంట్. ప్రతి ఒక్కరికీ జీరో బ్యాలెన్స్‌తో ఎక్కౌంట్ ఉండేలా చేయడమే ఈ ఎక్కౌంట్ ఉద్దేశ్యం. ఈ ఎక్కౌంట్‌ను పోస్టాఫీసులు, ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల్లో ఓపెన్ చేయవచ్చు. 2014 ఆగస్టు 28 నుంచి అమల్లో వచ్చిన ఈ జన్‌ధన్ యోజన ఎక్కౌంట్‌తో ఇంకా ఏయే లాభాలున్నాయో తెలుసుకుందాం..

లబ్దిదారుడికి కేంద్ర ప్రభుత్వం ద్వారా అందే ప్రతి సంక్షేమ పధక ప్రయోజనం నేరుగా జన్‌ధన్ యోజన ఎక్కౌంట్ ద్వారానే చేరుతోంది. అంటే నేరుగా ఈ ఎక్కౌంట్‌లో సంబంధిత సంక్షేమ పథకపు నగదు జమవుతుంది. ఎక్కౌంట్‌లో బ్యాలెన్స్ లేకపోయినా సరే..అత్యవసరమైనప్పుడు పది వేల రూపాయలు విత్‌డ్రా చేసుకోవచ్చు. రూపే డెబిట్ కార్డు కూడా అందుతుంది. పదేళ్లు పైబడిన వారందరూ ఈ ఎక్కౌంట్ ఓపెన్ చేసేందుకు అర్హులు. 

ఈ ఎక్కౌంట్ ఓపెన్ చేసినప్పుడు మీకు రూపే డెబిట్ కార్డు, 2 లక్షల ప్రమాద భీమా, 30 వేల జీవిత భీమా, డిపాజిట్ పై వడ్డీ అందుతుంది. అంతేకాదు పది వేల రూపాయలు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం కూడా ఉంటుంది. ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్ ఇలా ఏదో ఒక రుజువుతో జన్‌ధన్ ఎక్కౌంట్ ఓపెన్ చేయవచ్చు. మొన్నటి వరకూ జన్‌ధన్ ఎక్కౌంట్ ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం 5 వేల రూపాయలుండగా..కేంద్ర ప్రభుత్వం పదివేలకు పెంచింది. అయితే ఎక్కౌంట్ ఓపెన్ చేసి కనీసం ఆరు నెలలుంటేనే ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం వర్తిస్తుంది. 65 ఏళ్లు దాటినవారికి ఈ ఎక్కౌంట్ వర్తించదు.

Also read: IRCTC Rail Connect App: రైల్ కనెక్ట్ యాప్‌తో ప్రయాణ టికెట్ల బుకింగ్ ఇక మరింత సులభతరం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook

Section: 
English Title: 
Pradhan mantri jan dhan yojana acccount total benefits, 10 thousand overdraft facility
News Source: 
Home Title: 

Jan Dhan Account: జన్‌ధన్ యోజన ఎక్కౌంట్‌తో కలిగే ప్రయోజనాలేంటో తెలుసా..

Jan Dhan Account: జన్‌ధన్ యోజన ఎక్కౌంట్‌తో కలిగే ప్రయోజనాలేంటో తెలుసా..అత్యవసరంలో ఇలా ఉపయోగం
Caption: 
Jandhan yojana account ( file photo)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Jan Dhan Account: జన్‌ధన్ యోజన ఎక్కౌంట్‌తో కలిగే ప్రయోజనాలేంటో తెలుసా..
Md. Abdul Rehaman
Publish Later: 
No
Publish At: 
Wednesday, May 18, 2022 - 14:28
Created By: 
Md. Abdul Rehaman
Updated By: 
Md. Abdul Rehaman
Published By: 
Md. Abdul Rehaman
Request Count: 
52
Is Breaking News: 
No