Rajyasabha Kcr: జగన్ బాటలో కేసీఆర్.. రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో ట్విస్ట్!

Rajyasabha Kcr: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో చివరి నిమిషంలో ట్విస్ట్ ఇచ్చారు. ఎవరూ ఊహించని విధంగా తెలంగాణకు చెందిన ఇద్దరిని ఏపీ నుంచి రాజ్యసభకు ఎంపిక చేశారు.తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా జగన్ బాటలోనే నడుస్తున్నట్లు కనిపిస్తోంది. రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో ఆయన కూడా చివరి నిమిషంలో ట్విస్ట్ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : May 18, 2022, 05:12 PM IST
  • ఏపీ సీఎం జగన్ బాటలో తెలంగాణ సీఎం కేసీఆర్
  • రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో ట్విస్టులు
  • కొత్త ముఖాల పేర్లు పరిశీలిస్తున్న కేసీఆర్
Rajyasabha Kcr: జగన్ బాటలో కేసీఆర్.. రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో ట్విస్ట్!

Rajyasabha Kcr: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో చివరి నిమిషంలో ట్విస్ట్ ఇచ్చారు. ఎవరూ ఊహించని విధంగా తెలంగాణకు చెందిన ఇద్దరిని ఏపీ నుంచి రాజ్యసభకు ఎంపిక చేశారు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి పేరు మొదటి నుంచి ప్రచారంలో ఉంది. జగన్ కేసులు వాదిస్తున్న నిరంజన్ రెడ్డికి బెర్త్ ఖాయమని అంతా భావించారు. కాని బీసీ సంఘం నేత ఆర్ కృష్ణయ్య పేరును మాత్రం ఎవరూ అంచనా వేయలేకపోయారు. తాడేపల్లిలోని సీఎం జగన్ క్యాంప్ కార్యాలయానికి కృష్ణయ్య వెళ్లేవరకు ఆయన పేరును ఎవరూ గెస్ చేయలేకపోయారు. ఒక రకంగా తెలంగాణకు చెందిన ఇద్దరికి ఏపీ నుంచి రాజ్యసభ సీట్లు ఇచ్చి సీఎం జగన్ సాహసమే చేశారని అంటున్నారు. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా జగన్ బాటలోనే నడుస్తున్నట్లు కనిపిస్తోంది. రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో ఆయన కూడా చివరి నిమిషంలో ట్విస్ట్ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది.

తెలంగాణలో ఖాళీగా ఉన్న మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నిక జరుగుతోంది. ఇందులో ఒకటి ఉప ఎన్నిక. మూడు సీట్ల కోసం అధికార టీఆర్ఎస్ పార్టీలో పోటీ తీవ్రంగానే ఉంది. కొన్ని రోజులుగా అభ్యర్థుల ఎంపికపై కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. పెద్దల సభకు వెళ్తారంటూ కొన్ని పేర్లపై ప్రచారం సాగుతోంది. ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావు పేర్లు రేసులో ముందున్నాయి. ఇక ఓసీ కోటాలోనే నమస్తే తెలంగాణ ఎండీ దామోదర్ రావు, కరీంనగర్ మాజీ ఎంపీ వినోద్ కుమార్, గాయకుడు దేశపతి శ్రీనివాస్ పేర్లు తెరపైకి వచ్చాయి. తుమ్మలతో పాటు మరికొందరు కమ్మ నేతలు రాజ్యసభ సీటు కోసం ప్రయత్నిస్తున్నారనే చర్చ నడుస్తోంది. మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు పేరు కూడా వినిపించింది. బీసీ కోటాలో మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, ఎస్సీ కోటాలో మందా జగన్నాథం, ఎస్టీ కోటాలో సీతారాం నాయక్ పేర్లు వినిపించాయి.

అయితే తాజాగా టీఆర్ఎస్ అభ్యర్థుల రేసులో కొత్త పేరు వినిపిస్తోంది. ఖమ్మం జిల్లాకు చెందిన గ్రానెట్ వ్యాపారి వద్దిరాజు రవిచంద్ర పేరును సీఎం కేసీఆర్ పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. రవిచంద్రకు సీఎంవో కార్యాలయం నుంచి కాల్ వెళ్లినట్లు కూడా తెలుస్తోంది. రవి చంద్ర మున్నురు కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. గతంలో కాంగ్రెస్ లో పని చేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ ఈస్ట్ నుంచి పోటీ చేశారు. తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు డైరెక్షన్ లోనే వద్దిరాజు కారెక్కారని ప్రచారం ఉంది. ఇప్పుడు ఆయన పేరు టీఆర్ఎస్ పెద్దల సభ రేసులో ఉండటం రాజకీయ వర్గాల్లో హాట్ హాట్ గా మారింది.తెలంగాణ కాపులు రాజకీయంగా బలంగా ఉన్నారు. ఉత్తర తెలంగాణలో గెలుపోటములను ప్రభావితం చేస్తారు. దీంతో వద్దిరాజుకు రాజ్యసభ ఇవ్వడం ద్వారా కాపులకు మరింత దగ్గర కావొచ్చని కేసీఆర్ స్కెచ్ వేశారని తెలుస్తోంది.

ఖమ్మం జిల్లా నుంచి రేసులో ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావును వచ్చే ఎన్నికల బరిలో నిలపాలని కేసీఆర్ డిసైడ్ అయ్యారని అంటున్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొత్తగూడెం నుంచి పోటీ చేయడానికి ఆసక్తిగా ఉన్నారని చెబుతున్నారు. అందుకే ఆయన రెండేళ్ల కాలం పదవి ఉన్న రాజ్యసభ సీటును ఆఫర్ చేసినా తిరస్కరించారని.. కొత్తగూడెం అసెంబ్లీ సీటు ఇవ్వాలని కేసీఆర్ ను కోరినట్లు తెలుస్తోంది. ఇక తుమ్మలను ఖమ్మం లోక్ సభ లేదా ఏదో ఒక అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయించాలని కేసీఆర్ ప్లాన్ చేశారని అంటున్నారు.

READ ALSO: Revanth Reddy Fire On Kcr:నక్సల్స్ భయంతో పారిపోయిన దొరల కోసమే ధరణి! పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

READ ALSO: Chandrababu Kadapa Tour: జగన్ ఇలాకాలో గర్జించిన చంద్రబాబు.. నియంతను తరిమికొడతామని వార్నింగ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook

Trending News