YSR Sanchara Pashu Arogya Seva: మూగ జీవాలకు అత్యాధునిక వైద్యం.. పశు అంబులెన్సులు ప్రారంభించిన సీఎం జగన్

YSR Sanchara Pashu Arogya Seva: ఆంధ్రప్రదేశ్ లో మరో సంక్షేమ కార్యక్రమం ప్రారంభమైంది. మూగ జీవాల కోసం వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవలు అందుబాటులోనికి వచ్చాయి.పశువుల అంబులెన్సులను తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు.

Written by - ZH Telugu Desk | Last Updated : May 19, 2022, 01:00 PM IST
  • ఏపీలో మూగ జీవాలకు అత్యాధునిక వైద్యం
  • పశు అంబులెన్సులు ప్రారంభించిన సీఎం జగన్
  • తొలి విడతలో అందుబాటులో 175 అంబులెన్సులు
YSR Sanchara Pashu Arogya Seva: మూగ జీవాలకు అత్యాధునిక వైద్యం.. పశు అంబులెన్సులు ప్రారంభించిన సీఎం జగన్

YSR Sanchara Pashu Arogya Seva: ఆంధ్రప్రదేశ్ లో మరో సంక్షేమ కార్యక్రమం ప్రారంభమైంది. మూగ జీవాల కోసం వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవలు అందుబాటులోనికి వచ్చాయి.పశువుల అంబులెన్సులను తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 340 పశువుల అంబులెన్సులను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం 278 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది జగన్ ప్రభుత్వం. తొలి విడతగా 143 కోట్ల రూపాయలతో కొనుగోలు చేసిన 175 పశు అంబులెన్సులను సీఎం జగన్ ప్రారంభించారు. ఇకపై ఏపీలో మూగజీవాలకు మెరుగైన వైద్యం అందనుంది. పశు పోషకులు ఇంటి దగ్గరకే వచ్చి చికిత్స అందిస్తారు.

రెండో దశలో 135 కోట్ల రూపాయలతో మరో 165 అంబులెన్సులు ఏర్పాటు కానున్నాయి. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో రెండు పశు అంబులెన్సులను అందుబాటులో ఉంచనున్నారు. 108 సేవల మాదిరిగానే అత్యాధునిక సౌకర్యాలు పశు అంబులెన్సులతో సమకూర్చారు. వీటి కోసం ప్రత్యేకంగా టోర్ ఫ్రీ నెంబర్ తీసుకొచ్చారు. 1962కు కాల్ చేస్తే పశువుల అంబులెన్సులు రానున్నాయి. సత్వరమే స్పందించి పశువులకు కావాల్సిన చికిత్స అందించనున్నారు పశు పోషకులు. మెరుగైన వైద్యం కావాల్సి వస్తే దగ్గరలోని ఏరియా పశు వైద్యశాలకు తరలిస్తారు. అంబులెన్సుల నిర్వహణ ఖర్చు మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే భరించనుంది.

పశు అంబులెన్స్ లో ఒక వెటర్నరీ డాక్టర్,వెటర్నరి డిప్లొమా చేసినా అసిస్టెంట్, డ్రైవర్ కమ్ అటెండర్ ఉన్నారు. 20 రకాల పేడ సంబంధిత పరీక్షలు, 15 రకాల రక్తపరీక్షలు చేసేందుకు మైక్రోస్కోప్‌తో కూడిన చిన్న ప్రయోగశాలను ఏర్పాటు చేశారు. అన్ని రకాల టీకాలు, మందులతో పాటు పశువులను వాహనంలోకి ఎక్కించేందుకు హైడ్రాలిక్‌ సౌకర్యం అంబులెన్సులో ఉంది. ప్రాథమిక వైద్యసేవలతో పాటు చిన్న జంతువులు, పెట్స్, పక్షులకు ఆపరేషన్ చేసేందుకు అంబులెన్సులో  ఏర్పాట్లు ఉన్నాయి.

READ ALSO: Liquor Prices Hike: పర్సు ఖాళీ అయితేనే కిక్కు.. మందుబాబులకు కేసీఆర్ సర్కార్ షాక్

READ ALSO: Rajyasabha Elections: జగన్ కోటాలో బండికి రాజ్యసభ సీటు! కేసీఆర్ స్కెచ్ మాములుగా లేదుగా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook

Trending News