Uber Ride Fares: పెరిగిన ఊబెర్ రైడ్ ధరలు, పాసెంజర్లకు మరింత భారం

Uber Ride Fares: ఇంధన ధరల పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని..ఊబెర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. డ్రైవర్లకు ఉపయోగపడేలా..రైడ్ ధరల్ని పెంచుతోంది.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 20, 2022, 08:42 AM IST
Uber Ride Fares: పెరిగిన ఊబెర్ రైడ్ ధరలు, పాసెంజర్లకు మరింత భారం

Uber Ride Fares: ఇంధన ధరల పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని..ఊబెర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. డ్రైవర్లకు ఉపయోగపడేలా..రైడ్ ధరల్ని పెంచుతోంది.

ఇంధన ధరలు ఇటీవలి కాలంలో విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఆ ప్రభావం క్యాబ్, ట్యాక్సీ, ఆటోలపై పడుతోంది. ఈ నేపధ్యంలో డ్రైవర్లకు ఉపయోగపడేలా ఊబెర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఊబెర్ క్యాబ్ రైడ్ ధరల్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇంధన ధరల పెరుగుదల, రైడ్ ధరల పెంపుపై డ్రైవర్ల అసోసియేషన్ కంపెనీ దృష్టికి తీసుకెళ్లింది. ఈ నేపధ్యంలో డ్రైవర్ల ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని..డ్రైవర్లకు ఇబ్బంది కలగకుండా ఊబెర్ రైడ్ ధరల్ని పెంచాలనే నిర్ణయం తీసుకున్నట్టు ఆ సంస్థ ప్రతినిధి నితీష్ భూషణ్ తెలిపారు. 

అదే సమయంలో రైడ్ డెస్టినేషన్ గురించి డ్రైవర్లకు ముందుగానే తెలిసేలా ఊబెర్ ఏర్పాట్లు చేస్తోంది. అటు రైడర్ నుంచి పేమెంట్ నగదు లేదా ఆన్‌లైన్ ఏ రూపంలో వచ్చేది కూడా డ్రైవర్లకు సమాచారం అందించనుంది. ఇదంతా ట్రిప్‌కు ముందే డ్రైవర్ కు తెలియనుంది. ఊబెర్ రైడ్ క్యాన్సిలేషన్, ధరల పెంపుకు సంబంధించి కీలకాంశాలివే..

రైడ్ క్యాన్సిలేషన్, క్యాన్సిలేషన్ ఛార్జీలు, ర్యాండమ్ సర్జ్ ప్రైసింగ్, లాంగ్ వెయిటింగ్ టైమ్స్ వంటివాటిపై సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ ఊబెర్, ఓలా సంస్థల్ని హెచ్చరించింది.

రైడ్ క్యాన్సిలేషన్, సర్జ్ ప్రైసింగ్‌కు సంబంధించిన సమస్యల పరిష్కారానికి ఊబెర్, ఓలా సంస్థలకు కన్జ్యూమర్ రెగ్యులేటర్ ఛీఫ్ కమీషనర్ నిధి ఖారే నెలరోజుల గడువిచ్చారు.

సర్జ్ ప్రైసింగ్, రైడ్ క్యాన్సిలేషన్‌కు సంబంధించిన కొత్త మార్గదర్శకాలు జారీ చేయాలని..ఫలితంగా రైడర్‌కు అవగాహన ఉంటుందని కన్జ్యూమర్స్ ఎఫైర్స్ శాఖ వెల్లడించింది. 

Also read: Credit Card New Rules: క్రెడిట్ కార్డులకు సంబంధించి తప్పకుండా తెలుసుకోవల్సిన ఆర్బీఐ కొత్త నిబంధనలు, జూన్ 1 నుంచే అమలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News