Jyeshta month 2022: జీవితంలో చాలా కష్టాలు ఉన్నాయా? జూన్ 14 లోపు ఈ పని చేయండి, అన్ని బాధలు తొలగిపోతాయి

Jyeshta Month 2022: జ్యేష్ట మాసంలో హనుమంతుడికి, శని దేవుడికి ప్రత్యేక పూజలు చేయండి. ఈ ఇద్దరికీ ఈ మాసం చాలా ప్రీతికరమైనది. జ్యేష్ఠ మాసంలోని అన్ని మంగళవారాలను బడ మంగళ్ లేదా బుద్వా మంగళ్ అంటారు.   

Edited by - ZH Telugu Desk | Last Updated : May 21, 2022, 05:32 PM IST
Jyeshta month 2022: జీవితంలో చాలా కష్టాలు ఉన్నాయా? జూన్ 14 లోపు ఈ పని చేయండి, అన్ని బాధలు తొలగిపోతాయి

Jyeshta Month Significance and Remedies in Telugu: హిందూ క్యాలెండర్‌లో మూడో నెలను జ్యేష్ఠ మాసం అంటారు. ఈ మాసంలో సూర్యుని యొక్క బలమైన కిరణాలు భూమిపై పడతాయి. కాబట్టి ఈ మాసంలో నీరు, గొడుగు, పాదరక్షలు, జ్యూస్ ఉన్న పండ్లను దానం చేయడం చాలా శుభప్రదంగా భావిస్తారు. జ్యేష్ఠ మాసం (Jyeshta month 2022) మే 17 నుండి ప్రారంభమై జూన్ 14 వరకు కొనసాగుతుంది. ఈ మాసంలో సూర్యుడు మరియు వరుణ దేవుడిని పూజిస్తారు. అలాగే ఆంజనేయుడు మరియు శని దేవుడిని ఈ మాసంలో ప్రముఖంగా పూజించాలి. . 

హనుమంతుడి అనుగ్రహం పొందాలంటే..
వీలైతే జ్యేష్ఠ మాసంలోని ప్రతి మంగళవారం హనుమంతుడిని ఆరాధించండి. హనుమాన్ చాలీసా పఠించండి. ఈ రోజున నీళ్లతో నిండిన కుండను దానం చేయండి. పేదలకు ఆహారం ఇవ్వండి. దీంతో ట్రబుల్‌ షూటర్ హనుమంతుడు సంతోషించి సర్వ దుఃఖాలను తొలగిస్తాడు. దీంతో పాటు జాతకంలో కుజుడు బలపడతాడు.

ప్రతి శనివారం ఈ పరిహారాలు చేయండి
జ్యేష్ఠ మాసంలోని ప్రతి శనివారం శని దేవుడిని ఆరాధించండి. శనిదేవుడు ఈ నెల అమావాస్య నాడు జన్మించాడు. ఈ సంవత్సరం శని జయంతి రోజు సోమవతి అమావాస్య. ఈ రోజున పూర్వీకులకు తర్పణం-శ్రాద్ధం చేయండి. దీంతో పూర్వీకులు సంతుష్టులై వారిని ఆశీర్వదిస్తారు. అలాగే, శనివారం నల్ల నువ్వులు, నల్ల బట్టలు, ఉరద్ దానం చేయండి. శని సడే సతి, ధైయా, కాల సర్ప యోగంతో బాధపడేవారు శని జయంతి రోజున ఈ పరిహారాన్ని తప్పనిసరిగా చేయాలి. ఇలా చేస్తే వారు కష్టాల నుండి బయటపడతారు. 

Also Read: Venus Transit in Aries 2022: మేషరాశిలో శుక్ర సంచారం.... ఈ 5 రాశుల వారిపై 26 రోజుల పాటు డబ్బు వర్షం! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News