/telugu/photo-gallery/good-news-employees-and-students-tomorrow-schools-and-govt-office-holiday-in-telangana-rv-180844 Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు 180844

కనుసైగతో ఓవర్‌నైట్‌లో స్టార్‌గా మారిన ప్రియాప్రకాశ్‌ వారియర్‌‌కు కష్టాలు వచ్చిపడ్డాయి. ఆమె నటించిన తొలి మలయాళ చిత్రం 'ఓరు ఆదార్‌ లవ్‌' ను కష్టాలు చుట్టుముడుతున్నాయి. తాజాగా ఇద్దరు హైదరాబాద్‌ వాసులు ఈ సినిమాకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ సినిమాలోని 'మాణిక్య మలరాయ పూవి' పాటను తొలగించాలని కోరుతూ న్యాయస్థానంలో పిటిషన్‌ వేశారు. పవిత్రమైన పాటలో కన్నుగీటినట్టు చిత్రించడం.. ఇస్లాంలో 'దైవదూషణ' లాంటిదేనని పేర్కొన్నారు.

‘మాణిక్య మలరాయ పూవి’ పాట వీడియో కొన్ని రోజుల కిందట ఇంటర్నెట్‌లో తెగ హల్ చల్ చేసిన విషయం తెలిసిందే..! ఈ పాటలో ప్రియా వారియర్‌ తన క్లాస్‌మేట్‌ను చూసి నవ్వుతూ.. కన్నుకొట్టే దృశ్యాలు వైరల్‌ అయ్యాయి. ఈ వీడియోతో ఆమె ఒక్కరాత్రిలోనే స్టార్‌డం తెచ్చుకుంది. అయితే, ఈ వీడియో క్లిప్‌పై పలు ముస్లిం సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఇది తమ మనోభావాలను దెబ్బతీసేలా ఉందని తెలిపాయి.

మహ్మద్ ప్రవక్త, ఆయన భార్య ఖదీజా బివీని ప్రశంసిస్తూ రాసిన పాటను ఈ సినిమాలో వాడుకొని.. అభ్యంతరకర దృశ్యాలను షూట్ చేశారని పిటిషనర్లు తెలిపారు. ‘30 సెకన్ల వీడియోలో పాఠశాల బాలిక.. ఓ బాలుడిని చూస్తూ నవ్వుతూ.. కనుబొమ్మలు ఎగరేస్తూ.. కన్నుకొట్టినట్టు చూపించారు. కన్నుకొట్టడం ఇస్లాం మతంలో నిషేధం. ఇది ఇస్లాంలో దైవదూషణ లాంటిదే’ అని పిటిషనర్లు తెలిపారు. ఇప్పటికే పిటిషనర్లలో ఒకరు సినిమా డైరెక్టర్ ఒమర్‌ లులుకు వ్యతిరేకంగా హైదరాబాద్ పీఎస్‌లో కేసు వేశారు.

Section: 
English Title: 
Priya Prakash Varrier's Oru Adaar Love: Winking forbidden in Islam, claims new plea in SC
News Source: 
Home Title: 

ప్రియ కన్ను కొట్టడం.. వివాదంగా మారింది

ప్రియాకు చిక్కులు: కన్నుకొట్టడం ఇస్లాంలో నిషేధం
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
ప్రియాకు చిక్కులు: కన్నుకొట్టడం ఇస్లాంలో నిషేధం