PM Modi Tour: జపాన్‌లో భారత ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన కొనసాగుతోంది. రెండు రోజుల పర్యటన నిమిత్తం అక్కడికి చేరుకున్న ఆయన బిజీ బిజీగా గడుపుతున్నారు. తొలిరోజు టోక్యోలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు. భారత్, జపాన్ సహజ భాగస్వాములని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. భారతదేశ అభివృద్ధిలో జపాన్ దేశస్థుల పెట్టుబడులు కీలక పాత్ర పోషిస్తున్నాయని చెప్పారు.
ప్రపంచ దేశాలు బుద్ధుడు చూపిన మార్గాన్ని అనుసరించాలన్నారు. సవాల్‌గా ఉన్నా హింస, అరాచకం, ఉగ్రవాదం, వాతావరణ మార్పుల నుంచి మానవాళిని అదే కాపాడుతుందని తెలిపారు. ఎంత పెద్ద సమస్య వచ్చినా భారత్ ఇట్టే పరిష్కారం చూపుతుందన్నారు. కరోనా సమయంలో ఇదే రుజువయ్యిందని స్పష్టం చేశారు. మేడిన్ ఇండియా వ్యాక్సిన్లతో వైరస్‌ను ఎదుర్కోగలిగామన్నారు.
భారత వ్యాక్సిన్లు వంద దేశాలకు సరఫరా అయ్యాయని గుర్తు చేశారు. తాను జపాన్‌కు వచ్చిన ప్రతిసారి మంచి ఆదరణ దక్కుతోందన్నారు ప్రధాని మోదీ. ప్రవాస భారతీయులు తనపై చూపుతున్న ఆదరణ మరవలేనిదన్నారు. జపాన్‌లో స్థిరపడినా..భారతీయ సంస్కృతిని కొనసాగిస్తున్నారని..ఇందుకు అందర్నీ అభినందిస్తున్నానని చెప్పారు. మోదీ మాట్లాడుతున్న సమయంలో ప్రాంగణమంతా హోరెత్తింది.
భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు మిన్నంటాయి. జపాన్ టూర్‌లో క్వాడ్ కూటమి సదస్సులో ఆయన పాల్గొనననున్నారు. ఈ సమావేశంలో భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ దేశాలు పాల్గొంటాయి. జపాన్ ప్రధాని కిషద, ఆస్ట్రేలియా నూతన ప్రధాని ఆంటోని అల్బనీస్‌తో ప్రత్యేకంగా భేటీ అవుతారు. ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఈ సందర్భంగా పలు ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. దీనిపై పీఎంవో ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
Also read:IPL 2022 Sixes: ఐపీఎల్‌లో సిక్సర్ల మోత..1000వ సిక్సర్ ఎవరు కొట్టారంటే..!
Also read:CM Jagan Tour: టెక్ మహీంద్రా సీఈవో గుర్నానితో సీఎం జగన్ భేటీ..కీలక అంశాలపై చర్చ..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook
PM Modi Tour: భారత్, జపాన్ సహజ భాగస్వాములు.. టోక్యోలో ప్రధాని మోదీ కీలక స్పీచ్..!
జపాన్‌లో నరేంద్ర మోదీ
ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగం
క్వాడ్ సమావేశంలో పాల్గొననున్న పీఎం