'సత్యాగ్రహంతోనే గాంధీ మహాత్ముడుయ్యారు'

మహాత్ముడి చంపారన్ సత్యాగ్రహానికి 100 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా బీహార్‌లో జరిగిన స్వచ్ఛాగ్రాహీల కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు.

Last Updated : Apr 10, 2018, 04:47 PM IST
'సత్యాగ్రహంతోనే గాంధీ మహాత్ముడుయ్యారు'

మహాత్ముడి చంపారన్ సత్యాగ్రహానికి 100 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా బీహార్‌లో జరిగిన స్వచ్ఛాగ్రాహీల కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. సత్యాగ్రహంతోనే గాంధీ మహాత్ముడిగా, బాపూగా మారారని తెలిపారు. అటు ఈ స్ఫూర్తితో స్వచ్ఛ భారత్ కోసం 20 వేల మంది స్వచ్ఛాగ్రాహీలు చేస్తున్న కృషి ఓ నూతన ఆరంభానికి నాందిగా మారిందని తెలిపారు. స్వచ్ఛత ప్రతి వ్యక్తి జీవితంలోనూ భాగం కావాలని, అప్పుడే స్వచ్ఛ భారత్‌ మిషన్‌ పూర్తవుతుందని ప్రధాని అన్నారు.

స్వచ్ఛ భారత్‌ మిషన్‌ పూర్తయ్యే వరకూ ఉద్యమం ఆగదని ఆయన అన్నారు. మహాత్మా గాంధీ చేపట్టిన సత్యాగ్రహ ఉద్యమంలో అన్ని వర్గాలు పాల్గొన్నాయని మోదీ గుర్తు చేశారు. అదేవిధంగా స్వచ్ఛాగ్రాహీ ఉద్యమంలో కూడా అన్ని వర్గాలు పాల్గొనాలని, అప్పుడే స్వచ్ఛ భారత్‌ విజయవంతమవుతుందని ఆయన చెప్పారు.

జయప్రకాష్ నారాయణ్ సైతం తన ఉద్యమానికి గాంధీ సత్యాగ్రహంతోనే స్ఫూర్తి పొందారన్నారు. బీహార్ సీఎం, డిప్యూటి సీఎం స్వల్పకాలంలోనే బీహార్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారని ప్రధాని అన్నారు. ఈ సందర్భంగా పూర్తి విద్యుత్ చాలిత వేగవంత రైలు లోకోమోటివ్‌ను బీహార్‌లో జాతికి అంకితం చేశారు ప్రధాని మోదీ. అలాగే మోతీహరిలో 4 మురుగునీటి పారుదల పథకాలకు శంకుస్థాపన కూడా చేశారు.

Trending News