Hair growth Tips: మారుతున్న జీవన శైలి కారణంగా చాలా మంది అమ్మాయిలు జుట్టు సమస్యలతో బాధపడుతుంటారు. కొంతమందిలో పోషకాహార లోపం వల్ల జుట్టు రాలడం వంటి సమస్యలు కూడా వస్తున్నాయి. మరికొంత మందిలో జుట్టు బలహీనంగా మారి సన్నబడుతుంది. ఈ సమస్య నుంచి విముక్తి పొందడానికి ఎన్ని ప్రయత్నాలు చేసి కొంతమందికి ఆశించిన ఫలితం దక్కడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
స్కాల్ప్‌ను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోండి:
జుట్టు పెరుగుదలను మెరుగుపరచడానికి స్కాల్ప్‌ను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలని నిపుణులు తెలుపుతున్నారు.షాంపూతో తలస్నానం చేసినప్పుడల్లా తేలికపాటి చేతులతో తలపై మసాజ్ చేయాడం వల్ల రక్త ప్రసరణను మెరుగుపడుతుంది.
ఆహారం తీసుకోవడంలో శ్రద్ధ వహించండి:
సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల జుట్టుకు పోషకాలు అందుతాయి. కావున ఆహారం తీసుకోవడంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని నిపుణులు చెబుతున్నారు.
జుట్టును తేమగా ఉంచాలి:
హెయిర్‌వాష్ చేసే ముందు జుట్టుకు బాగా నూనె రాయాలి. దీంతో కడిగిన జుట్టు పొడిబారకుండా ఉంటుంది.
తడి జుట్టును దువ్వొద్దు:
తడి జుట్టును ఎప్పుడూ దువ్వకండి. దీని వల్ల జుట్టు సమస్యలు వచ్చే అవకశాలున్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈ విషయంపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలని నిపుణులు చెబుతురన్నారు.
(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Heel Pain: మడమ నొప్పితో బాధపడుతున్నారా..ఈ చిట్కాను పాటించి విముక్తి పొందండి..!!
Also Read: Dieting Home Remedies: బరువు తగ్గేందుకు సులభమైన వంటింటి చిట్కాలు ఇవే