Vastu Tips For Shankh: శంఖం యొక్క ప్రత్యేక ప్రాముఖ్యత హిందూ మతంలో చెప్పబడింది. పూజా మందిరంలో శంఖాన్ని (Shankh) ఊదడం వల్ల శత్రువులు నశించిపోతారని, ఇంట్లో సానుకూల శక్తి ఉంటుందని నమ్ముతారు. లక్ష్మిదేవికి ప్రీతిపాత్రమైన శంఖాన్ని ఆలయంలో ఉంచడం ద్వారా ఆ తల్లి అనుగ్రహం లభిస్తుంది. లక్ష్మీదేవి సముద్రరాజు కుమార్తె అని, శంఖం ఆమె సోదరుడు అని నమ్ముతారు. అందువల్ల శంఖం ఉన్న చోట లక్ష్మీ దేవి నివాసం ఉంటుందని ప్రతీతి.
హిందూమత శుభ కార్యాలలో శంఖాన్ని ఉపయోగిస్తారు. పురాణాల ప్రకారం, సముద్ర మథనం సమయంలో 14 రత్నాలు లభించాయి. దీనిలో శంఖం కూడా ఉంది. శంఖంలో దక్షిణావర్తి శంఖం ఉత్తమమైనదిగా చెప్పబడింది. వాస్తులో కూడా, లక్ష్మీదేవి (Goddess lakshami) అనుగ్రహం పొందడానికి దక్షిణావర్తి శంఖాన్ని ఉంచాలని సూచించబడింది. ఈ శంఖాన్ని ఉంచడం వల్ల ఇంట్లో సంపద, ఆహారానికి లోటు ఉండదు. ఈ శంఖంతో ఎలా పూజించాలో, దాని ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం.
శంఖంతో పూజించండి ఇలా
వాస్తు ప్రకారం, ఇంట్లో శంఖాన్ని దక్షిణ దిశలో ఉంచడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. వాటిని పట్టించుకోకపోతే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. దక్షిమావర్తి శంఖాన్ని ఎరుపు రంగు వస్త్రంపై ఉంచండి. శంఖంలో గంగాజలం నింపిన తర్వాత ఓం శ్రీ లక్ష్మీ సహోదరాయై నమః అనే మంత్రాన్ని జపించండి. మంత్రం జపించిన తర్వాత శంఖాన్ని ఎర్రటి గుడ్డలో చుట్టి ఉంచండి. శుక్రవారం నాడు ఈ పూజ చేస్తే...మీకు మంచి ప్రతిఫలం దక్కుతుంది.
దక్షిణావర్తి శంఖం ప్రాముఖ్యత
ఇంట్లో దక్షిణ దిశలో శంఖాన్ని ఉంచడం వల్ల లక్ష్మీదేవి నివాసం ఉంటుందని నమ్ముతారు. ఇంట్లో దక్షిణ దిశలో శంఖాన్ని ఉంచితే సరిపోదు, దానికి కూడా విధిగా పూజ చేయాలి. శంఖం ధ్వనులతో ఇంటిలోని ప్రతికూల శక్తి నశిస్తుంది. దక్షిణావర్తి శంఖం శాస్త్రాలలో చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. కడుపు కుడి వైపున తెరుచుకుంటే అదే దక్షిణావర్తి శంఖం. ఈ విధంగా మీరు ఈ శంఖాన్ని గుర్తించవచ్చు.
Also Read: Gemology: కెరీర్‌లో విజయం సాధించాలంటే.. ఈ రత్నాలను ధరించండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook