Guava Leaves Benefits: ప్రకృతిలో ఎన్నో సహజ మూలికలు, ఆరోగ్య పదార్ధాలున్నాయి. ఒక్కొక్కదానికి ఒక్కో విశిష్ట గుణం. ఆధునిక జీవన శైలి కారణంగా ఎదుర్కొంటున్న స్థూలకాయానికి ప్రకృతిలో..మన చుట్టూ విరివిగా కన్పించే జామకాయలతో పరిష్కారం ఉందని మీకు తెలుసా..
మనచుట్టూ విరివిగా లభించే జామకాయలతో కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. జామకాయలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు చాలా తక్కువమందికే తెలుసు. జామలో ఎన్నోరకాల పోషక పదార్ధాలున్నాయి. ఆధునిక జీవనశైలి కారణంగా ప్రధానంగా ఎదుర్కొంటున్న స్థూలకాయ సమస్యకు పరిష్కారం కూడా జామలోనే ఉందంటున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు. ఇంకా ఇతర ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి.
బరువు తగ్గడంలో...
శరీరంలోని కాంప్లెక్స్ స్టార్చ్ చక్కెరగా మారినప్పుడు బరువు పెరగడం ప్రారంభమవుతుంది. లేదా విపరీతమైన ఆకలి కూడా బరువు పెరగడానికి దోహదమవుతుంది. లేత జామ ఆకుల్ని క్రమం తప్పకుండా రోజూ తీసుకుంటే..శరీరంలోని కార్బోహైడ్రేట్లు తగ్గుతాయి. ఫలితంగా బరువు క్రమంగా తగ్గుతుంది. ముఖ్యంగా జీర్ణక్రియను జామ మెరుగుపరుస్తుంది. శరీరపు మెటబాలిజం స్థిరమవుతుంది. ఇది బరువు తగ్గడానికి కారణమవుతుంది. ఎందుకంటే బరువు పెరిగేందుకు ప్రధాన కారణం జీర్ణక్రియ సరిగ్గా లేకపోవడం, మెటబాలిజం సామర్ధ్యం తగ్గడమే.
ఇక విరేచనాల సమస్యను కూడా జామాకులతో దూరం చేయవచ్చు. అరకప్పు బియ్యం పిండిని, జామాకులను ఓ గ్లాసు నీటిలో వేసి బాగా మరిగించాలి. ఈ నీటిని రోజుకు రెండుసార్లు తాగితే అతిసార తగ్గడమే కాకుండా..పొట్ట బరువుగా ఉండే సమస్య పోతుంది. లేత జామాకులతో టీ చేసుకుని తాగితే..కొంత ఆలస్యమైనా..బరువు తగ్గించుకోవచ్చు. జామాకుల టీతో కొలెస్ట్రాల్ సమస్య తగ్గుతుంది.
జామాకుల టీతో ఇంకా ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఈ టీ కారణంగా శరీరంలో ఆల్ఫా గ్లూకోసిడెస్ ఎంజైమ్ చర్య నియంత్రణలో వస్తుంది. ఫలితంగా బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. అయితే దీనికోసం జామాకుల టీని కనీసం 3 నెలల పాటు క్రమం తప్పకుండా తీసుకోవాలి. జామాకుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు వృద్ధాప్య ఛాయల్ని తొలగిస్తుంది. ఫలితంగా చర్మం కాంతివంతమవుతుంది.
Also read: White Hair Problem: చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతుందా..ఈ అలవాట్లు మానుకోండి..!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.