గత కొనేళ్లుగా తాను హెచ్ఐవీ ట్రీట్ మెంట్ తీసుకుంటున్నట్లు ఆస్ట్రియాకు చెందిన పాప్ సింగర్ కొంచితా వురస్ట్ తెలిపింది. చికిత్సతో తన వల్ల ఇతరులకు హెచ్ఐవీ సోకే అవకాశాలు తక్కువని చెప్పింది. జన్మతహా పురుషుడే అయినా కొంచిత అసలు పేరు థామన్ న్యూ విర్త్.
వివరాల్లోకి వెళ్తే.. యవ్వనంలోనే తనలో ఉన్న వైరుధ్యాలను గుర్తించి కొంచితగా అవతారం ఎత్తింది. తాను గే అని ప్రకటించుకుంది కూడా. స్వలింగ సంపర్కుల హక్కుల కోసం బహిరంగంగా మద్దతు ఇచ్చింది కూడా. తనను తాను ఓ మహిళగానే ప్రొజెక్ట్ చేసుకుని.. కొంచిత అనే పేరుతో కొనసాగుతుండటం విశేషం.
ఇప్పుడు ఈ పాప్ సింగర్ తనకు హెచ్ఐవీ పాజిటివ్ ఉందనే విషయాన్ని ప్రపంచానికి చెప్పింది. లక్షలాది మంది ఫాలోవర్స్ కు.. ఓ ట్వీట్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది కొంచిత. దీని గురించి అందరికీ చెప్పాల్సిన అవసరం లేకపోయినా.. పరిస్థితులు ఇలా ప్రభావితం చేశాయని చెప్పింది. ‘నా మాజీ బాయ్ ఫ్రెండ్ ఒక వ్యక్తి. ఈ ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ ను అందరికీ చెబుతానంటూ కొంతకాలంగా నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. అతను బెదిరించిన మాత్రాన నేను భయపడను. అలాంటివారివల్ల కారణంగా నా జీవితం మీద ప్రభావం పడడం నాకు ఇష్టం లేదు’ అని చెప్పింది కొంచిత. ఈమెకు ప్రపంచవ్యాప్తంగా చాలానే గుర్తింపు ఉంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హెచ్ఐవీ బాధితుల సంఖ్య 70 మిలియన్లు. 1980 నుండి హెచ్ఐవీ/ఎయిడ్స్ బారినపడి 35 మిలియన్ల మంది మరణించారు.