Neem Remedies to overcome Shani Kethu Effects: హిందూ సంస్కృతి, సాంప్రదాయాల్లో వేప చెట్టుకు చాలా ప్రాధాన్యం ఉంది. ఇంటి ప్రాంగణంలో లేదా వెలుపల వేప చెట్టు ఉండటం మంచిదని భావిస్తారు. వేప చెట్టులో పుష్కలమైన ఔషధ గుణాలు ఉంటాయి. అంతేకాదు, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వేప ద్వారా అనేక పరిహారాలు ఉంటాయి. జాతక దోషాలు తొలగిపోవడానికి, అశుభాలు, గండాలు గట్టెక్కడానికి వేపతో పలు పరిహారాలు సూచించబడ్డాయి. వీటిని పాటించడం ద్వారా శని లేదా కేతువు నుంచి విముక్తి పొందవచ్చు. ఆ పరిహారాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...
వేపతో పాజిటివ్ ఎనర్జీ :
హిందూ విశ్వాసాల ప్రకారం.. ఏ ఇంట్లోనైతే వేప చెట్టు ఉంటుందో.. ఆ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ సంతరించుకుంటుంది. నెగటివ్ ఎనర్జీ బయటకు ప్రారదోలబడుతుంది. ఆ ఇంటి ఆవరణలోకి నెగటివిటీ ప్రవేశించదు. దీంతో ఆ కుటుంబం సుఖ సంతోషాలతో విలసిల్లుతుంటుంది. చాలా మంది వేప చెట్టును దుర్గాదేవి అవతారంగా భావిస్తారు. అందుకే దీనిని నీమారి దేవి అని కూడా పిలుస్తారు.
శని మహాదశ ఎలా తొలగిపోతుంది
మీ జాతకంలో శని ప్రభావం ఉన్నట్లయితే ఆ బాధలు, కష్టాలు చెప్పనలవి కావు. శని ప్రభావం నుంచి బయటపడాలంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని పరిహారాలు చేయాల్సి ఉంటుంది. పరిహారంలో బాగంగా చిన్న వేప కొమ్మను ముక్కలుగా పగలగొట్టి దాన్ని మాల లాగా తయారుచేయాలి. ఒక నెల పాటు ఈ మాలను ధరించడం ద్వారా మీ జాతకంలో శని ప్రభావం బలహీనపడుతుంది. అశుభాలు తొలగిపోతాయి.
ఇలా కేతువు కోపం నుండి విముక్తి పొందండి
కేతువు ఆగ్రహంతో కష్ట,నష్టాలు అనుభవిస్తున్నవారికి వేపపువ్వును మించిన పరిష్కారం లేదు. కేతువును శాంతించేలా చేయాలంటే తమ ఇంట్లో వేప చెక్కతో హవనం చేయాలి. సుమారు 2 నెలల పాటు ఇలా చేయాలి. దీనితో పాటు వేప ఆకుల రసాన్ని తీసి స్నానం చేసే నీటిలో కలుపుకోవాలి. ఈ రెండు చర్యలతో, కేతువు ఆగ్రహం నుంచి విముక్తి పొందుతారు.
పితృ దోషం నుంచి బయటపడేందుకు
పితృ దోషం అనేక రకాల ఇబ్బందులకు కారణమవుతుంది. మీరు కూడా ఇలాంటి సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే, జ్యోతిష్య శాస్త్రంలో దీనికి పరిష్కారం సూచించబడింది. జాతకంలో పితృదోషం తొలగిపోవాలంటే ఇంటికి దక్షిణం లేదా వాయువ్య మూలలో వేప చెట్టును నాటాలని శాస్త్రాలు చెబుతున్నాయి. దీని కారణంగా, పూర్వీకులు సంతోషిస్తారు. మీ కుటుంబంపై వారి చల్లని చూపు ఉంటుంది.
Also Read: Male Fertility: పాలలో ఇది కలిపి తాగితే పురుషులలో స్పెర్మ్ కౌంట్ ఘనీయంగా పెరుగుతుంది..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook