Fathers Day 2022: అందరికీ ఓ రోజు. అలాగే రేపు ప్రపంచవ్యాప్తంగా తండ్రులకు హ్యాపీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు. అసలు ఫాదర్స్ డే ఎప్పుడు, ప్రాముఖ్యతేంటి, ఫాదర్స్ డే వెనుక నేపధ్యమేంటి, ఎలా విషెస్ చెప్పాలనేది తెలుసుకుందాం..
రేపు అంటే జూన్ 19, 2022న ప్రపంచ తండ్రుల దినోత్సవం. ఫాదర్స్ డే. జూన్ నెలలో మూడవ ఆదివారం ఫాదర్స్ డే ఈసారి జూన్ 19 న ఉంది. తమ కుటుంబాన్ని ఫిజికల్‌గా, ఆర్ధికంగా, ఆరోగ్యంగా తీర్చిదిద్దేందుకు అహర్నిశలూ కష్టపడే తండ్రులు నిజమైన హీరోలు. ఎందుకంటే తండ్రి అనేవాడు కొడుకుకు తొలి హీరో అయితే..కూతురికి తొలి ప్రేమగా ఉంటాడు.
ఫాదర్స్ డే ప్రాముఖ్యత
ఫాదర్స్ డే అనేది ప్రతి ఒక్కరి జీవితంలో తండ్రి పాత్రకు సింబల్‌గా నిలుస్తుంది. ఫాదర్స్ డే పురస్కరించుకుని శుభాకాంక్షలు చెప్పేందుకు పిల్లలు చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు బహుమతులిస్తారు. మరి కొందరు అందమైన క్వొటేషన్లతో విషెస్ చెబుతుంటారు. ఇంకొంతమంది తండ్రుల్ని ఎక్కడికైనా తీసుకెళ్తుంటారు. ఇంకొంతమంది విహారయాత్రలు ప్లాన్ చేస్తుంటారు. ఎవరెన్ని రకాలుగా చేసినా..ఉద్దేశ్యం మాత్రం ఒక్కటే. ఫాదర్స్ డే శుభాకాంక్షలు చెప్పడమే. తమను కని పెంచి..బాధ్యతగా తీర్చిదిద్దినందుకు కృతజ్ఞతగా, గౌరవంగా కాస్సేపైనా ఆనందంగా గడపడమే.
ఫాదర్స్ డే చరిత్ర
ఫాదర్స్ డే అనేది ప్రపంచానికి అమెరికా ద్వారా పరిచయమైంది. అమెరికాలో సోనోరా స్మార్ట్ డోడ్ తొలిసారిగా ఫాదర్స్ డేను జరిపి ప్రపంచానికి పరిచయం చేశారని చెబుతారు. సోనోరా తండ్రి విలియమ్ జాక్సన్ స్మార్ట్. అర్కాన్సాస్ నుంచి వచ్చిన అతను ఆరుగురు పిల్లలకు సింగిల్ పేరెంట్. అన్నా జార్విస్ తన తల్లికి గౌరవంగా మదర్స్ డే క్రియేట్ చేసినట్టే తండ్రుల్ని గౌరవించేందుకు ఏదైనా కొత్తగా చేయాల్సి ఉందని చర్చ్ ఫాదర్‌తో సోనోరా చెబుతుంది. తన తండ్రి కష్టాన్ని గుర్తించేందుకు, తగిన రీతిలో గౌరవం ఇచ్చందుకు, తండ్రులందరికీ ఒక రోజు ఉండాలని విలియమ్స్ పుట్టినరోజైన జూన్ 5న ఫాదర్స్ డే జరపాలని ఆలోచించింది. దీనికోసం చర్చ్ ప్రతినిధుల్ని ఒప్పించింది. అయితే ఆ ప్రయత్నంలో ఫాదర్స్ డే జరిపే తేదీ మారింది. అదే నెలలో మూడవ ఆదివారం జరపాలని నిర్ణయించారు. సోనోరా చెప్పిన తేదీలోగా ఏర్పాట్లు చేయడం కష్టమని భావించి అలా చేశారు. అప్పట్నించి జూన్ నెలలో మూడవ ఆదివారం ఫాదర్స్ డే నిర్వహిస్తున్నారు.
ఫాదర్స్ డే ఎలా జరుపుకోవడం, కొన్ని ఐడియాలు
మీ తండ్రికి మంచి భోజనం ఇష్టమైతే..అతనిని అలా పిక్నిక్కు తీసుకెళ్లండి. తేలికైన స్నాక్స్, లంచ్ ప్రిపేర్ చేయండి. కాలక్షేపం కోసం ఏదైనా గేమ్స్ ప్లాన్ చేస్తే బాగుంటుంది. మరీ ముఖ్యంగా మీ ఫాదర్‌కు ఇష్టమైన పాటను ప్లే చేయడం మర్చిపోవద్దు సుమా. ఇక రెండవది భోజన ప్రియులకు పనికొచ్చే ఐడియా. ఏదైనా కొత్త రెస్టారెంట్‌కు తీసుకెళ్లి..కొత్తగా ఏదైనా వంటకాన్ని ఆర్డర్ చేయండి. నిజంగా బాగుంటే ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి కలుగుతుంది.
మీ ఫాదర్‌తో కలిసి ఏదైనా ప్రత్యేకమైన రుచికరమైన ఫుడ్ ప్రిపేర్ చేయండి. అదే కొత్త వంటకాలు చేస్తే మర్చిపోలేని అనుభూతి కలుగుతుంది. లేదా ఇద్దరూ కలిసి వంట సిద్ధం చేస్తే మరీ మంచిది.
మీ ఫాదర్‌ను లాంగ్ డ్రైవ్ కు తీసుకెళ్లడం ద్వారా ఫాదర్స్ డేను ప్లాన్ చేయవచ్చు. విభిన్నమైన కోణాల్లో ఫోటోలు తీసి భద్రపర్చుకుంటే ఆ యాత్ర ఎప్పటికీ మర్చిపోలేనిదిగా ఉంటుంది. ఇక చివరిది ఫాదర్స్ డే నాడు మీ బిజీ పనుల్నించి కాస్త ఖాళీ చేసుకోండి. ఒకవేళ మీ తండ్రి ఆ రోజు ఏమైనా పనిలో బిజీగా ఉంటే ఆయన పనిలో సహాయం చేయండి.
మంచి మంచి అందమైన క్వొటేషన్లతో గ్రీటింగ్ కార్డులు సొంతంగా క్రియేట్ చేసి ఇస్తే ఆ అనుభూతి బాగుంటుంది. యాంత్రికంగా కాకుండా..ఏదైనా వినూత్నంగా ప్లాన్ చేసి ఫాదర్స్ డే జరుపుకుంటే..అది మీ జీవితంలోనే కాదు..మీ తండ్రి జీవితంలో కూడా ఓ మర్చిపోలేని అనుభూతిని మిగుల్చుతుంది.
Also read: Running Tips: రన్నింగ్ తరువాత పొరపాటున కూడా చేయకూడని పొరపాట్లు ఇవే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook