Yoga Research: యోగా పరిశోధనల్లో ఆశ్చర్యపరిచే నిజాలు, వయస్సు తగ్గించే ప్రాణాయామం

Yoga Research: యోగా గురించి ఆశ్చర్యకరమైన నిజాలు వెలుగుచూస్తున్నాయి. యోగాతో పెరుగుతున్న వయస్సును నియంత్రించవచ్చంటున్నాయి ఆ పరిశోధనలు. ఆశ్చర్యంగా ఉందా..ఆ వివరాలు పరిశీలిద్దాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 18, 2022, 11:40 PM IST
Yoga Research: యోగా పరిశోధనల్లో ఆశ్చర్యపరిచే నిజాలు, వయస్సు తగ్గించే ప్రాణాయామం

Yoga Research: యోగా గురించి ఆశ్చర్యకరమైన నిజాలు వెలుగుచూస్తున్నాయి. యోగాతో పెరుగుతున్న వయస్సును నియంత్రించవచ్చంటున్నాయి ఆ పరిశోధనలు. ఆశ్చర్యంగా ఉందా..ఆ వివరాలు పరిశీలిద్దాం..

మీకు కూడా పెరుగుతున్న మీ వయస్సును నియంత్రించాలనుందా..యోగా ఇందుకు దోహదపడుతుంది మరి. యోగాపై ముఖ్యంగా ఈ అంశంపై చాలా పరిశోధనలు జరిగాయి. ఇందులో వెలుగుచూసిన నిజాలు ఆశ్చర్యపరుస్తున్నాయి.

ఇండియాలో 2015లో అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రారంభమైంది. వరుసగా 8వ సారి జూన్ 21వ తేదీన ప్రపంచవ్యాప్తంగా 79 దేశాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకోనున్నారు. ప్రపంచవ్యాప్తంగా యోగాకు ఆదరణ ఎందుకు పెరుగుతుందంటే..యోగాపై వెలుగుచూస్తున్న పరిశోధనలే కారణం. ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద్, ఢిల్లీ ఐఐటీ సంయుక్తంగా చేసిన పరిశోధనల్లోయోగాసనాల్లో ఒకటైన ప్రాణాయామంతో పెరుగుతున్న వయస్సును నియంత్రించవచ్చని తేలింది.

కేవలం కొద్ది నిమిషాలసేపు చేసే భ్రామరీ ప్రాణాయామంతో ఎన్ని ప్రయోజనాలున్నాయనేది తాజాగా జరిపిన పరిశోధనలో వెల్లడైంది. ఢిల్లీ ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదం, ఢిల్లీ ఐఐటీ సంయుక్తంగా ఈ పరిశోధన చేశారు. ఆ ఫలితాలు కీలకమైన సంకేతాల్ని ఇస్తున్నాయి.

ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదంలోని యోగా విభాగం రీసెర్చ్ సైంటిస్టు డాక్టర్ మేధా కులకర్ణి చెప్పినదాని ప్రకారం 70 మందిపై దాదాపు ఏడాది నుంచి చేస్తున్న ఈ పరిశోధనలో కీలకమైన విషయం వెలుగుచూసింది. భ్రామరీ ప్రాణాయామం అనేది మెమరీ పవర్ పెంచేందుకు, ఒత్తిడి తగ్గించేందుకు, రక్తపోటు నియంత్రణలో పనిచేస్తుందని తెలిసింది. అన్నింటికంటే ముఖ్యంగా ఈ ప్రాణాయామంతో పెరుగుతున్న వయస్సు చాలావరకూ తగ్గుతుందని తేలింది. 

ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదం డైరెక్టర్ డాక్టర్ తనూజా నేసారీ చెప్పిందాని ప్రకారం ప్రాణాయామంతో పుట్టే ధ్వని..మస్తిష్కాన్ని శాంతంగా ఉంచే పనిచేస్తుందని ఢిల్లీ ఐఐటీ తేల్చింది. ఈ ప్రక్రియ కారణంగా ఉద్భవించే ధ్వనితో చాలామంది ఈసీజీ ఫలితాలు మెరుగ్గా కన్పించాయట. అంటే గుండె సంబంధిత రోగాలు కూడా ప్రాణాయామం ద్వారా తగ్గుతున్నాయని తేలింది. ఈ పరిశోధన ఫలితాల్లో ప్రాణాయామంతో పెరుగుతున్న వయస్సుని నియంత్రించవచ్చని తేలింది. 

ఈ రీసెర్చ్ ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదం వైద్యులు, సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది సహా మొత్తం 70 మందిపై పరిశోధనలు జరిపింది. యోగా ట్రైనింగ్ ద్వారా వీరికి వారంలో 5 రోజులు ప్రాణాయామం చేయించేవారు. 

Also read: Coconut Oil Benefits: మీ ముఖ సౌందర్యం మెరుగవ్వాలంటే..రోజూ ఆ నూనె రాయాల్సిందే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News