Finger Signs: అమ్మాయి చేతివేళ్లు ఇలా ఉంటే..కాబోయే భర్తకు అదృష్టమా, దురదృష్టమా

Finger Signs: సాముద్రిక శాస్త్రంలో ప్రతి వ్యక్తి శరీర నిర్మాణం, ఆకారంతో భవిష్యత్, స్వభావాన్ని అంచనా వేయవచ్చు. అమ్మాయిలు వేళ్లు ఆ ఆకారంలో..అలా ఉంటే ఇక కాబోయే భర్త అదృష్టం మెరిసిపోతుందట..అదేంటో చూద్దాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 19, 2022, 05:48 PM IST
Finger Signs: అమ్మాయి చేతివేళ్లు ఇలా ఉంటే..కాబోయే భర్తకు అదృష్టమా, దురదృష్టమా

Finger Signs: సాముద్రిక శాస్త్రంలో ప్రతి వ్యక్తి శరీర నిర్మాణం, ఆకారంతో భవిష్యత్, స్వభావాన్ని అంచనా వేయవచ్చు. అమ్మాయిలు వేళ్లు ఆ ఆకారంలో..అలా ఉంటే ఇక కాబోయే భర్త అదృష్టం మెరిసిపోతుందట..అదేంటో చూద్దాం.

సాముద్రిక శాస్త్రంలో వ్యక్తి చేయి, కాలు, నోరు, శరీర నిర్మాణం ఆధారంగా ఆ వ్యక్తి స్వభావం, గుణం, భవిష్యత్ వంటివి పూర్తిగా తెలుసుకోవచ్చని అంటారు జ్యోతిష్య పండితులు. ఈ శాస్త్రం సహాయంతో ఏ మనిషి భవిష్యత్ గురించైనా విస్తృతంగా తెలుసుకోవచ్చు. సాముద్రిక శాస్త్రంలోవ్యక్తి చేతివేళ్ల గురించి స్పష్టమైన వివరణ ఉంది. వాటి ఆధారంగా వ్యక్తిత్వాన్ని అంచనా వేయవచ్చు. అందుకే ఇప్పుడు మేం కూడా అమ్మాయి వేళ్ల గురించి ప్రస్తావిస్తున్నాం. సాముద్రిక శాస్త్రం ప్రకారం అమ్మాయి చేతివేళ్ల ఆకారం, నిర్మాణం బట్టి..ఆ అమ్మాయి కాబోయే భర్త ఏ మేరకు అదృష్టవంతుడో చెప్పేయవచ్చంట..

చేతి వేళ్లు చిన్నగా ఉంటే

సాముద్రిక శాస్త్రం ప్రకారం ఏ అమ్మాయి చేతివేళ్లు చిన్నగా ఉంటాయో..ఆ అమ్మాయి ఎక్కువ ఖర్చుపెట్టే గుణం కలిగి ఉంటుంది. ఇటువంటి అమ్మాయిలు షాపింగ్, లగ్జరీ వస్తువుల కొనుగోలుపై ఆసక్తి చూపిస్తారు. కానీ ఈ అమ్మాయిలు బంధుత్వాల్ని బాగా నిలబెట్టుకుంటారు. సుఖ దుఖాల్లో ఇతరులకు ఎప్పుడూ సహాయంగా ఉంటారు. బహిరంగంగా అభిప్రాయలు చెప్పే గుణం కలిగి ఉంటారు. అందుకే వీరి అభిప్రాయాలు మరొకరి అభిప్రాయాలతో సరిపోవు. 

వేళ్ల ముందు భాగం సన్నగా

అమ్మాయి చేతివేళ్ల ముందు భాగం సన్నగా ఉంటే..అలాంటి అమ్మాయిలతో దాంపత్య జీవితం చాలా సుఖంగా ఉంటుంది. అలాంటి అమ్మాయిలు చాలా కేరింగ్‌గా ఉంటారు. ఇంటి గురించి, కుటుంబసభ్యుల గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ఇలాంటి వేళ్లున్న అమ్మాయిలు..అటు భర్తకు ఇటు అత్తమామలకు అదృష్టంగా మారుతారు.

లావుగా, నిండైన చేతివేళ్లుంటే

చేతివేళ్లు లావుగా ఉండి, నిండుగా ఉండే అమ్మాయిలు బంధుత్వాల విషయంలో చాలా సీరియస్‌గా ఉంటారు. డబ్బులు ఖర్చు పెట్టడంపై ఆసక్తి ఎక్కువ. ఈ అమ్మాయిలు తమ తండ్రి, భర్త డబ్బుల్ని నిర్లక్ష్యంగా ఖర్చుపెట్టేస్తారు. అందుకే ఇలాంటి అమ్మాయిలతో తరచూ కుటుంబసభ్యులకు వివాదమౌతుంటుంది. అయితే ఈ అమ్మాయిల స్వభావం కాలక్రమేణా మారిపోతుంది. 

గుండ్రమైన, పొడుగు వేళ్లుంటే

ఇలాంటి వేళ్లుండే అమ్మాయిలు చాలా అదృష్టవంతులు. స్వభావరీత్యా..ప్రతి ఒక్కరి మనసు గెల్చుకుంటారు. ప్రత్యేకించి అత్తారింట్లో మన్ననలు పొందుతారు. ఏదైనా విషయంపై ఒక్కసారిగా చెడు అభిప్రాయానికి రారు. ప్రతి స్థితిలో భర్తలో కలిసే ఉంటుంది. వ్యాపారగుణాలుంటాయి. ప్రతి వ్యాపారంలో భర్తకు చేదోడుగా ఉంటుంది. ఇలాంటి అమ్మాయిల్ని పెళ్లి చేసుకునే అబ్బాయిల జీవితం ఇక సుమధురమే..ఆనందమే ఆనందం.

Also read: Rajayogam Effect: 30 ఏళ్ల తరువాత మహాపురుష రాజయోగం, ఆ నాలుగు రాశులవారికి ఐశ్వర్యమే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News