ఆర్యభట్టకు 43 ఏళ్లు..కొన్ని ఆసక్తికర విశేషాలు

ఇస్రో ఆధ్వర్యంలో ఆర్యభట్ట పేరుతో నిర్మించిన శాటిలైటును అంతరిక్షంలోకి ప్రవేశపెట్టి నేటితో 43 ఏళ్లు కావస్తోంది. 

Last Updated : Apr 20, 2018, 12:16 PM IST
ఆర్యభట్టకు 43 ఏళ్లు..కొన్ని ఆసక్తికర విశేషాలు

ఇస్రో ఆధ్వర్యంలో ఆర్యభట్ట పేరుతో నిర్మించిన శాటిలైటును అంతరిక్షంలోకి ప్రవేశపెట్టి నేటితో 43 ఏళ్లు కావస్తోంది. భారతీయ పురాతన ఖగోళశాస్త్రవేత్త ఆర్యభట్ట జ్ఞాపకార్థం ఈ ఉపగ్రహానికి ఆ పేరుతో నామకరణం చేసారు.

1975 సంవత్సరంలో మన దేశానికి శాటిలైట్‌లను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టే సాంకేతికవిజ్ఞానం ఇంకా అందుబాటులో లేదు. ఆ సమయంలో సోవియట్ యూనియన్ సహాయంతో రష్యా ప్రయోగకేంద్రం నుండి ఈ ఉపగ్రహాన్ని పంపించడం జరిగింది. ప్రముఖ అంతరిక్ష శాస్త్రవేత్త యూ ఆర్ రావు ఈ ప్రాజెక్టుకి సారధ్యం వహించారు. ఈ ఉపగ్రహం గురించి మనం కూడా కొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకుందాం

  • స్పుత్నిక్ 1 అనే ఉపగ్రహం ప్రపంచంలోనే తొలి శాటిలైట్‌గా పేరుగాంచింది. ఆ తర్వాత 18 సంవత్సరాల తర్వాత మళ్లీ అంతరిక్షంలోకి దూసుకెళ్లిన శాటిలైట్ ఆర్యభట్ట మాత్రమే.
  • భారత అంతరిక్షశాస్త్ర పితామహుడు విక్రమ్ సారాభాయ్ తన శిష్యుడు యూఆర్ రావుతో పంచుకున్న ఓ ఆలోచన.. ఆర్యభట్ట నిర్మాణానికి దోహదపడింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానం ఉపయోగించి ఉపగ్రహం తయారుచేయించాలన్నది సారాభాయ్ కోరిక.
  • ఆర్యభట్టను సోవియట్ దేశం నుండి అంతరిక్షంలోకి పంపించడం కోసం, భారతదేశం రష్యాతో పలు ఒప్పందాలు చేసుకొంది. ఆ ఒప్పందాల్లో భాగంగానే రష్యా తమ నౌకలను ట్రాకింగ్ చేయడానికి భారతదేశ పోర్టులను ఉపయోగించుకుంది.
  • ఈ ఉపగ్రహానికి ఆర్యభట్ట అనే పేరు పెట్టకముందే ఇందిరాగాంధీ వద్దకు మైత్రి, జవహర్ అనే మరో రెండు పేర్లు కూడా పరిశీలనకు వచ్చాయి. కానీ ఆమె ఆర్యభట్ట పేరును సిఫార్సు చేశారు.
  • ఆర్యభట్ట నిర్మాణానికి అప్పట్లోనే రూ.3.5 కోట్ల రూపాయలను భారత ప్రభుత్వం ఖర్చుపెట్టింది.
  • ఆర్యభట్ట ఉపగ్రహాన్ని నిర్మించడానికి 30 నెలల సమయం తీసుకున్నారు.
  • ఆర్యభట్ట కేవలం 5 రోజులు మాత్రమే పనిచేసింది. ఆ తర్వాత విద్యుత్ ఫెయిల్యూర్ వల్ల ఆగిపోయింది.
  • ఆ తర్వాత 17 సంవత్సరాల తర్వాత 10 ఫిబ్రవరి 1992 తేదిన భూమిని చేరుకుంది ఆర్యభట్ట.
  • ఆర్యభట్ట ఉపగ్రహం యొక్క చిత్రాన్ని 1976 మరియు 1997 భారతదేశపు 2 రూపాయల కరెన్సీనోట్లతో పాటు పలు 1 రూపాయి నోట్లపై ముద్రించారు.
  • ఆర్యభట్ట ఉపగ్రహం 26 పార్శతలాలు కలిగి ఉండడంతో పాటు..1.5 మీటర్ల వ్యాసంతో నిర్మించబడింది

Trending News