Mass Suicide in Maharashtra: మహారాష్ట్రలో పెను విషాదం.. ఒకే ఇంట్లో 9 మృతదేహాలు!

9 Members Of Family foud Dead At Home In Maharashtra. మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో ఒకే ఇంట్లో 9 మంది మృతదేహాలు పడి ఉన్న ఘటన ప్రస్తుతం కలకలం రేపుతోంది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 20, 2022, 06:29 PM IST
  • మహారాష్ట్రలో పెను విషాదం
  • ఒకే ఇంట్లో 9 మృతదేహాలు
  • ఆరు మృతదేహాలు ఇంట్లోని వేర్వేరు గదుల్లో
Mass Suicide in Maharashtra: మహారాష్ట్రలో పెను విషాదం.. ఒకే ఇంట్లో 9 మృతదేహాలు!

 Members Of Family foud Dead At Home In Maharashtra: మహారాష్ట్రలో పెను విషాదం చోటుచేసుకుంది. ఒకే ఇంట్లో 9 మంది మృతదేహాలు పడి ఉన్నాయి. మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం కలకలం రేపుతోంది. వీరందరూ ఒకే కుటుంబానికి చెందిన వారుగా పోలీసుల ప్రాధమిక విచారణలో తేలింది. ఇది సామూహిక ఆత్మహత్యగా పోలీసులు అనుమానిస్తున్నారు. 

ముంబైకి 350 కిలోమీటర్ల దూరంలో ఉన్న సాంగ్లీ జిల్లాలోని మహైసల్‌లోని ఓ ఇంట్లో సోమవారం (జూన్ 20) తొమ్మిది మృతదేహాలు లభ్యమయ్యాయి. చనిపోయిన వారిలో ఐదుగురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు. మూడు మృతదేహాలు ఓ చోట పడి ఉండగా.. మిగతా ఆరు మృతదేహాలు ఇంట్లోని వేర్వేరు గదుల్లో పడి ఉన్నాయి. ఒకే కుటుంబానికి చెందిన వీరందరూ విషపూరితమైన ఆహరం తీసుకుని మరణించారని తెలుస్తోంది. 

సాంగ్లీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ దీక్షిత్ గెడమ్ మాట్లాడుతూ... 'స్థానికుల సమాచారం మేరకు మహైసల్‌లోని ఒక ఇంట్లోకి వెళ్లి చూడగా.. తొమ్మిది మృతదేహాలు ఉన్నాయి. ఇంట్లో మూడు మృతదేహాలు ఒకే చోట, ఆరు మృతదేహాలు ఇతర వేర్వేరు ప్రదేశాలలో ఉన్నాయి. సంఘటనా స్థలంను పరిశీలిస్తున్నాం. మరణానికి గల కారణాలను సేకరిస్తున్నాం. సామూహిక ఆత్మహత్యగా అనుమానిస్తున్నాం' అని చెప్పారు. 

మృతి చెందిన ఎందరూ విషపూరితమైన పదార్థాన్ని సేవించినట్లు అనుమానిస్తున్నామని, పోస్టుమార్టం అనంతరం మృతికి కచ్చితమైన కారణం తెలియనుందని సాంగ్లీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ దీక్షిత్ గెడమ్ పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. 

Also Read: CM KCR Wife: సీఎం కేసీఆర్ సతీమణికి అస్వస్థత.. యశోద హాస్పిటట్‌లో చేరిక!

Also Read: Vastu Tips: ఉదయం నిద్రలేచిన వెంటనే ఈ పని చేయండి.. కోటీశ్వరులు అవ్వండి!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News