President Election: వెంకయ్యకు షాకిచ్చిన బీజేపీ.. రాష్ట్రపతి అభ్యర్థిగా అనసూయ ఊకే!

President Election: భారత 16వ రాష్ట్రపతి ఎన్నికకు నామినేషన్లు కొనసాగుతున్నాయి. నామినేషన్ల ప్రక్రియ మొదలై వారం రోజులవుతున్నా అభ్యర్థులెవరన్నది ఇంకా తేలలేదు. అధికార ఎన్డీఏ ఇంకా తమ క్యాండిడేట్ ను ప్రకటించలేదు. అటు విపక్షాలు ఉమ్మడి అభ్యర్థి కోసం ప్రయత్నిస్తున్నా కొలిక్కి రావడం లేదు.

Written by - Srisailam | Last Updated : Jun 21, 2022, 04:38 PM IST
  • వెంకయ్యకు షాకిచ్చిన బీజేపీ
  • ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా అనసూయ ఊకే
  • ప్రస్తుతం ఛత్తీస్ గఢ్ గవర్నర్ గా అనసూయ
President Election: వెంకయ్యకు షాకిచ్చిన బీజేపీ.. రాష్ట్రపతి అభ్యర్థిగా అనసూయ ఊకే!

President Election: భారత 16వ రాష్ట్రపతి ఎన్నికకు నామినేషన్లు కొనసాగుతున్నాయి. నామినేషన్ల ప్రక్రియ మొదలై వారం రోజులవుతున్నా అభ్యర్థులెవరన్నది ఇంకా తేలలేదు. అధికార ఎన్డీఏ ఇంకా తమ క్యాండిడేట్ ను ప్రకటించలేదు. అటు విపక్షాలు ఉమ్మడి అభ్యర్థి కోసం ప్రయత్నిస్తున్నా కొలిక్కి రావడం లేదు. అయితే రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి మంగళవారం కీలక పరిణామాలు జరిగాయి. విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా బరిలో ఉండనున్నారని తెలుస్తోంది. టీఎంసీ పదవికి ఆయన రాజీనామా చేయడంతో రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా పేరును శరద్ పవార్ అధికారికంగా ప్రకటించనున్నారని చెబుతున్నారు.

ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ఖరారైందని తెలుస్తోంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలు మంగళవారం మధ్యాహ్నం ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడిని కలిశారు. దీంతో రాష్ట్రపతి ఎన్నికల బరిలో వెంకయ్య లేరని తెలుస్తోంది.  రాష్ట్రపతి అభ్యర్దిగా తీసుకోవడంలేదని వెంకయ్యకే చెప్పేందుకే వీరిద్దరూ ఆయనను కలిసినట్లు సమాచారం. వెంకయ్య నాయుడుకు మోడీ సర్కార్ త్వరలోనే మరో కీలక పదవి ఇవ్వనుంది.. ఆ సమాచారమే ఉప రాష్ట్రపతికి అమిత్ షా, జేపీ నడ్డాలు చెప్పారని అంటున్నారు.

ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా గిరిజన నేతను ఖరారు చేశారని సమాచారం. అయితే మొదటి నుంచి వినిపిస్తున్న జార్ఖంజ్ మాజీ గవర్నర్ ద్రౌపది ముర్ము కాకుండా మరో పేరు తెరపైకి వచ్చింది. ఛత్తీస్ గఢ్ గవర్నర్ అనసూయ ఊకేను రాష్ట్రపతి అభ్యర్ధిగా బీజేపీ హైకమాండ్ దాదాపుగా ఖరారు చేసిందని తెలుస్తోంది. ఆమె పేరును బీజేపీ  పార్లమెంటరీ బోర్డు అధికారికంగా ప్రకటించనుంది. అనసూయ ఊకే ఉన్నత విద్యావంతురాలు. 1985లో ఉమ్మడి మధ్యప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అర్జున్ సింగ్ మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు.  2006లొ రాజ్యసభకు ఎంపికయ్యారు. 2019 లో చత్తీస్ ఘడ్ కి గవర్నర్ గా నియమితులయ్యారు అనసూయ ఊకే.

Read also: Presidential Election: రాష్ట్రపతి ఎన్నికల్లో ట్విస్ట్.. టీఎంసీకి యశ్వంత్ సిన్హా రాజీనామా?

Read also:  Tollywood Stars to OTT : డిజిటల్లోకి దూసుకుపోతున్న స్టార్లు ఎవరెవరంటే? 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Trending News