Andhra Pradesh Theaters Shutdown: ఆంధ్రప్రదేశ్ లో చాలా కాలం క్రితం సినిమా టికెట్ల వ్యవహారం మీద పెద్ద వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా విడుదల సమయంలో చెలరేగిన ఈ వివాదాన్ని సినీ పెద్దలు ప్రభుత్వం కలిసి ఎట్టకేలకు ఓ కొలిక్కి తీసుకువచ్చాయి.. అయితే ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్లు అన్ని ఆన్లైన్ వేదికగా విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దానికి సినీ పెద్దలు కూడా ఒప్పుకున్నారు. ప్రభుత్వానికి సంబంధించిన ఆంధ్ర ప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన ఒక పోర్టల్ ద్వారా ఈ సినిమా టికెట్ల విక్రయం జరపాలని నిర్ణయం తీసుకున్నారు.
ఈ మేరకు ఎంఓయూలు కుదుర్చుకోవాలని ఆంధ్రప్రదేశ్లో ఉన్న థియేటర్లు, మల్టీప్లెక్స్ యజమానులకు ఇప్పటికే రెవెన్యూ సిబ్బంది ఆదేశాలు జారీ చేశారు. అయితే ప్రభుత్వం చెప్పిన విధంగా ఎంవోయూ కుదుర్చుకోవడానికి థియేటర్ యజమానులు, ఎగ్జిబిటర్లు ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది. దానికి కారణం ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రైవేటు ఆన్లైన్ బుకింగ్ పోర్టల్స్ అనే ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి ప్రైవేట్ బుకింగ్ పోర్టల్స్ ప్రేక్షకుల మీద అదనపు భారం మోపి అందులో కొంత మొత్తాన్ని ఎగ్జిబిటర్లు, థియేటర్ల యజమానులకు ఇస్తుందనే ప్రచారం జరుగుతోంది. దానికి తగ్గట్టే ఎగ్జిబిటర్లకు భారీగా వడ్డీ లేని రుణాలు, థియేటర్ రిన్నోవేట్ చేసినప్పుడల్లా థియేటర్ యజమానులకు రుణాలు అందిస్తున్నారని చెబుతున్నారు.
అందువల్ల అన్ని విధాలా లాభదాయకంగా వున్న ప్రస్తుత విధానం నుంచి ప్రభుత్వ ఆన్ లైన్ విధానంలోకి మారేందుకు ఎగ్జిబిటర్లు అసలు ఇష్టపడడం లేదని అంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వ ఆన్లైన్ బుకింగ్ పోర్టల్ వస్తే ఆ ఆదాయం కోల్పోతామని భావిస్తున్న ఎగ్జిబిటర్లు ఈ విషయం మీద ముందుకు వెళ్లేందుకు ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయం మీద ప్రైవేట్ బుకింగ్ పోర్టల్స్ లీగల్ ఫైట్ కోసం సిద్ధమయ్యాయి. సోమవారం నాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీద వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఒకవేళ తమకు అనుకూలంగా స్టే రాకపోతే ఈ విషయం మీద ఏదో ఒక క్లారిటీ వచ్చే వరకు థియేటర్లు బంద్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ మేరకు తూర్పుగోదావరి జిల్లా ఎగ్జిబిటర్లు అమలాపురంలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో భాగంగా ఒక క్లారిటీ వచ్చే వరకు థియేటర్లు మూసివేస్తే మంచిది అనే విషయం మీద నిర్ణయం తీసుకున్నారు అని అంటున్నారు. ప్రభుత్వం చెబుతున్న దాని ప్రకారం అయితే 50 శాతం టికెట్లు ప్రభుత్వ పోర్టల్ ద్వారా అమ్మాలని మిగతా 50% టికెట్లు ఎలా అమ్ముకున్నా ఇబ్బంది లేదని చెబుతోంది. అయితే ప్రైవేట్ పోర్టల్స్ ద్వారా ఎక్కువ సర్వీస్ ఛార్జ్ పడుతుంది కాబట్టి సామాన్యులు అందరూ ప్రభుత్వ పోర్టల్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. అందుకే థియేటర్ల యజమానులు ప్రైవేట్ పోర్టల్స్ కలిసి ఈ విషయం మీద ప్రభుత్వాన్ని వెనక్కి తగ్గేలా లీగల్ ఫైట్ కు దిగాలని చూస్తున్నాయి. ఈ విషయం ఎలాంటి మలుపులు తీసుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది.
Also Read: Puri Warns to Bandla Ganesh: చీప్‌గా వాగొద్దు.. నాలుక కొరికేసుకోవడం మంచిదన్న పూరి!
Also Read: RGV - Draupadi Murumu: ద్రౌపది ముర్మును వివాదాస్పద ట్వీట్ చేసి డిలీట్ చేసిన వర్మ.. మళ్లీ పొగుడుతూ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.