Pan-Aadhaar Link: పాన్-ఆధార్ అనుసంధానానికి కేవలం మూడ్రోజులే గడువు, తరువాత భారీగా పెనాల్టీ

Pan-Aadhaar Link: మీ ఆధార్ కార్డు-పాన్‌కార్డు అనుసంధానం జరిగిందా లేదా..సింపుల్ పెనాల్టీతో ముడ్రోజులే గడువు మిగిలుంది. దాటితే ఇక భారీ పెనాల్టీ తప్పదు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ ఇదే సూచిస్తోంది.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 27, 2022, 11:42 PM IST
Pan-Aadhaar Link: పాన్-ఆధార్ అనుసంధానానికి కేవలం మూడ్రోజులే గడువు, తరువాత భారీగా పెనాల్టీ

Pan-Aadhaar Link: మీ ఆధార్ కార్డు-పాన్‌కార్డు అనుసంధానం జరిగిందా లేదా..సింపుల్ పెనాల్టీతో ముడ్రోజులే గడువు మిగిలుంది. దాటితే ఇక భారీ పెనాల్టీ తప్పదు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ ఇదే సూచిస్తోంది.

ఆధార్ కార్డును పాన్‌కార్డుతో అనుసంధానం చేయడం తప్పనిసరి. ఇప్పటికే చాలాసార్లు సీబీడీటీ గడువు పెంచింది. జూన్ 30 తేదీ ఇప్పుడు చివరితేదీగా ఉంది. అంటే మరో మూడ్రోజులు మాత్రమే మిగిలుంది. అది కూడా 5 వందల రూపాయల జరిమానాతో. ఇంతకుముందు మార్చ్ 31 గడువు తేదీగా ఉంది. ఇప్పుడిక జూన్ 30లోగా ఎట్టి పరిస్థితుల్లోనూ పాన్‌కార్డు -ఆధార్ కార్డు అనుసంధానం చేయాల్సిందే. జూన్ 30వ తేదీ దాటితే మాత్రం జరిమానా వేయి రూపాయలు చెల్లించాల్సివస్తుంది. 

వేయి రూపాయల జరిమానాతో 2023 మార్చ్ వరకూ

ఇన్‌కంటాక్స్ చట్టంలోని సెక్షన్ 234 హెచ్ ప్రకారం..2023 మార్చ్ 31 వరకూ పాన్‌కార్డు-ఆధార్ కార్డు అనుసంధానం చేసేందుకు 1000 రూపాయల జరిమానా చెల్లించాలి. వచ్చే ఏడాది వరకూ పాన్‌కార్డు పనిచేస్తుంది. 2022-23 ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేందుకు, రిఫండ్ క్లెయిమ్ చేసుకునేందుకు ప్రస్తుతం ఏ విధమైన సమస్య తలెత్తదు. కానీ 2023 మార్చ్ 31 తరువాత మాత్రం పాన్‌కార్డు డీయాక్టివేట్ అయిపోతుంది. ఆ తరువాత మీకు ఇబ్బందులు తప్పవు. 

పాన్‌కార్డు ఆధార్ కార్డు ఆన్‌లైన్‌లో ఎలా లింక్ చేసుకోవచ్చు

పాన్‌కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేసేందుకు ముందుగా మీరు ఇన్‌కంటాక్స్ ఈ ఫైలింగ్ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. ఇప్పుడు సైట్‌పై క్విక్ లింక్స్ ఆప్షన్ కన్పిస్తుంది. అక్కడ లింక్ ఆధార్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఇప్పుడు మీరు మీ పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఈ రెండు కార్డుల సమాచారం ఇచ్చిన తరువాత..ఓటీపీ జనరేట్ చేసుకోవాలి. రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేస్తే..ఆధార్ కార్డు-పాన్‌కార్డు అనుసంధానం అయిపోయినట్టే.

Also read: PM Kisan Nidhi Samman Yojana: రైతులకు నిరాశ, పీఎం కిసాన్ సమ్మాన్ నిధిలో ఇక ఆ అవకాశం లేనట్టే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News