Suriya to Oscars committee: ఇది కదా సూర్య క్రేజ్ అంటే.. ఏకంగా ఆస్కార్స్ కమిటీలో సభ్యుడిగా!

Suriya to join Oscars committee: అనేక హిట్ సినిమాలు అందుకున్న సూర్యకి ఇప్పుడు ఒక అరుదైన గౌరవం దక్కింది.  ఆస్కార్ కమిటీలో సభ్యుడైన మొదటి తమిళ నటుడిగా ఆయన నిలవనున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 29, 2022, 02:54 PM IST
  • వరుస సక్సెస్ లతో మంచి జోష్ మీదున్న సూర్య
  • తాజాగా ఆస్కార్స్ కమిటీకి ఆహ్వానం
  • తొలి తమిళ నటుడిగా రికార్డు
 Suriya to Oscars committee: ఇది కదా సూర్య క్రేజ్ అంటే.. ఏకంగా ఆస్కార్స్ కమిటీలో సభ్యుడిగా!

Suriya to join Oscars committee: తన తండ్రి నట వారసుడిగా సినీరంగ ప్రవేశం చేసి ప్రస్తుతం తమిళనాట స్టార్ హీరో గా కొనసాగుతున్నారు హీరో సూర్య. హీరోగా ఆయనకు ఎంత మంది అభిమానులు ఉన్నారో ఆయన వ్యక్తిత్వానికి కూడా అంతే మంది అభిమానులు ఉన్నారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఒకపక్క సినిమాలు చేస్తూ తనకు వచ్చిన ఆదాయాన్ని చాలా వరకు సామాజిక సేవా కార్యక్రమాలకు వెచ్చిస్తూ ఒక సేవా ఫౌండేషన్ కూడా ఏర్పాటు చేసి అనేకమంది హీరోలకు సూర్య రోల్ మోడల్ గా నిలుస్తున్నాడు సూర్య. తన సినీ కెరీర్లో ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించి అనేక హిట్ సినిమాలు అందుకున్న సూర్యకి ఇప్పుడు ఒక అరుదైన గౌరవం దక్కింది. 

దక్షిణ భారతదేశం నుంచి ఆస్కార్ అవార్డుల కమిటీ నుంచి ఆహ్వానం అందుకున్న తొలి హీరోగా రికార్డు సృష్టించాడు ఆయన. ఆస్కార్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కమిటీ సభ్యుడిగా నామినేట్ అయిన తొలి తమిళ నటుడుగా సూర్య నిలిచారు. ప్రతి సంవత్సరం,  వివిధ దేశాల నుండి కళాకారులను ఆస్కార్ బృందంలో సభ్యులుగా ఆహ్వానిస్తారు. ఈ సంవత్సరం ఆర్ట్స్ అండ్ సైన్స్ విభాగంలో భారత దేశానికి ప్రాతినిధ్యం వహించడానికి నటుడు సూర్యకు ఆహ్వానం అందింది. ఇలా నటుడు సూర్య ఆస్కార్ కమిటీలో సభ్యుడైన మొదటి తమిళ నటుడిగా నిలవనున్నారు. ఇక సూర్యతో పాటు హిందీ నటి కాజోల్‌ను కూడా ఈ వేడుకకు ఆహ్వానించారు. 

ఇక అదే విధంగా దర్శకత్వ విభాగంలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడానికి బాన్ నలిన్ ఆహ్వానించబడ్డారు. అంతేకాక డాక్యుమెంటరీ విభాగంలో సుష్మిత్ ఘోష్,  రిందు థామస్ లతో పాటు రచయితల విభాగంలో రీమా కోక్తి ఆహ్వానించబడ్డారు. ఇక ఈ క్రమంలో సూర్య అభిమానులు ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా అనే హ్యాష్‌ట్యాగ్‌ని క్రియేట్ చేసి ట్రెండ్ చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. 

గతేడాది సూర్య నిర్మించి,  నటించిన జైబీమ్ చిత్రం భారత్ తరఫున ఆస్కార్‌కు నామినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇక సూర్య నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే ఆయన ఇటీవలే కమలహాసన్ హీరోగా తెరకెక్కిన విక్రమ్ అనే సినిమాలో రోలెక్స్ అనే ఒక చిన్న అతిథి పాత్రలో కనిపించి ప్రేక్షకులు అందరినీ మెప్పించాడు. ఆయన ప్రస్తుతం తమిళ విలక్షణ దర్శకుడు బాల దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా క్యాన్సిల్ అయ్యిందని ఆ మధ్య ప్రచారం జరిగింది కానీ అలాంటిదేమీ లేదని సూర్య తన సోషల్ మీడియా పోస్టుల ద్వారా పరోక్షంగా క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా ద్వారా బాలా మళ్లీ మంచి ఫామ్ లోకి రావడం ఖాయమని అంటున్నారు సూర్య ఫాన్స్.

Also Read: RRR Movie: ఆర్ఆర్ఆర్ కి మరో అరుదైన గౌరవం.. ఇండియా నుంచే ఏకైక సినిమాగా!

Also Read: Dil Raju Son: మరోసారి తండ్రైన దిల్ రాజు.. వారసుడు వచ్చేశాడుగా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News