Kamika Ekadashi 2022: కామిక ఏకాదశి ఎప్పుడు? దీని వెనుక ఉన్న ఆసక్తికరమైన కథ ఏంటి?

Kamika Ekadashi 2022: ఈ నెల 24న కామిక ఏకాదశి వస్తుంది. ఈ కథను వినడం ద్వారా పాపాల నుండి విముక్తులై...మోక్షాన్ని పొందుతారని నమ్మకం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 2, 2022, 06:46 PM IST
  • జూలై 24న కామిక ఏకాదశి
  • ఈ రోజున విష్ణుమూర్తిని పూజిస్తారు
  • ఈ కథ వినడం ద్వారా పాపాల నుండి విముక్తి
Kamika Ekadashi 2022: కామిక ఏకాదశి ఎప్పుడు? దీని వెనుక ఉన్న ఆసక్తికరమైన కథ ఏంటి?

Kamika Ekadashi 2022: శ్రావణ మాసంలోని కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని 'కామిక ఏకాదశి' అంటారు. ఈ ఏకాదశి విష్ణుమూర్తికి అంకితం చేయబడింది. ఈ రోజున శ్రీహరిని పూజించి.. ఉపవాసం ఉండటం వల్ల మీరు కోరిన కోరికలన్నీ సిద్ధిస్తాయి. ఈసారి కామికా ఏకాదశి (Kamika Ekadashi 2022) జూలై 24, 2022 ఆదివారం నాడు వస్తుంది. కామిక  ఏకాదశి కథను వింటే పాపాల నుండి విముక్తి పొంది మోక్షం లభిస్తుందని నమ్ముతారు. కామికా ఏకాదశి ప్రాముఖ్యత, దాని వెనుక ఉన్న కథ గురించి తెలుసుకుందాం. 

కామిక  ఏకాదశి 2022 తేదీ:
ప్రారంభం - 23 జూలై 2022, శనివారం ఉదయం 11:27 నుండి
ముగింపు - 24 జూలై 2022, ఆదివారం మధ్యాహ్నం 1:45 గంటలకు

కామిక ఏకాదశి వ్రత కథ
ఈ కామిక ఏకాదశి కథ గురించి శ్రీకృష్ణుడు యుధిష్ఠిరుడు (ధర్మరాజు)కు చెప్పాడు. ఒక ఊరిలో ఒక బలవంతుడు మరియు ఒక బ్రాహ్మణుడు నివసించేవారు. ఇద్దరూ ఒకరినొకరు ద్వేషించుకునేవారు. ఒకరోజు వారిద్దరికీ మధ్య పెద్ద గొడవ జరిగింది. కోపంతో బలవంతుడైన ఆ వ్యక్తి బ్రాహ్మణుడిని చంపాడు. బ్రహ్మణుడిని చంపినందుకు అతడు సమాజం నుంచి బహిష్కరించబడ్డాడు.  అతను తన పాపానికి ప్రాయశ్చిత్తం కోసం ఒక మహర్షి దగ్గరికి వెళ్లాడు.  

బ్రాహ్మణుడిని చంపిన అపరాధం నుండి ఎలా బయటపడాలని మహర్షిని అడిగాడు. దయచేసి దీనికి ఏదైనా ఉపాయం చెప్పండి అని అడిగాడు. ఈ పాపం పోవాలంటే కామికా ఏకాదశి వ్రతం చేయమని మహర్షి సూచించాడు. మహర్షి చెప్పినట్లే కామిక ఏకాదశి రోజున విష్ణువును పూజించాడు.. శ్రీహరి అనుగ్రహంతో ఆ దోషం నుండి విముక్తుడయ్యాడు.

Also Read: Amarnath Yatra Secrets: అమరనాథ్ యాత్ర యెుక్క అంతుచిక్కని రహస్యాలు..!

 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News