Covid 19 Updates : దేశంలో కొవిడ్ వైరస్ విజృంభణ కొనసాగుతోంది. కొన్ని రాష్ట్రాల్లో కేసులు వేగంగా పెరిగిపోతున్నాయి. ఢిల్లీ, కేరళ రాష్ట్రాల్లో వైరస్ తీవ్రత తగ్గినట్లు కనిపిస్తున్నా.. తమిళనాడులో మాత్రం కల్లోలం రేపుతోంది. చెన్నై శనివారం ఒక్కరోజే 2 వేలకు పైగా కొవిడ్ కొత్త కేసులు రావడం కలకలం రేపుతోంది. దేశంలో నిన్నటితో పోల్చితే ఇవాళ కేసులు కాస్త తగ్గాయి. దేశంలో గత 24 గంటల్లో దేశంలో 16 వేల 103 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 31 మంది కొవిడ్ భారీన పడి చనిపోయారు. దీంతో దేశంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 5 లక్షల 25 వేల 199కి పెరిగింది.
గత 24 గంటల్లో కొవిడ్ నుంచి మరో 13 వేల 929 మంది కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య లక్షా పదకొండు వేలు దాటింది. దేశంలో రికవరీ రేటు 98.54 శాతంగా ఉంది. క్రియాశీల కేసుల సంఖ్య 0.26 శాతానికి పెరిగింది. దేశంలో వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. నిన్న మరో 10 లక్షల 10 వేల 652 మందికి టీకాలు వేశారు. ఇప్పటివరకు దేశంలో 197 కోట్ల 95 లక్షల 72 వేల 963 మంది కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. మరో మూడు వారాల పాటు కొవిడ్ కేసుల తీవ్రత ఉంటుందని , ప్రజలంతా జాగ్రత్తలు పాటించాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
#COVID19 | India reports 16,103 fresh cases, 13,929 recoveries and 31 deaths, in the last 24 hours.
Active cases 1,11,711
Daily positivity rate 4.27% pic.twitter.com/bSAssBCfIX— ANI (@ANI) July 3, 2022
Also read: Central Government: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త, 8వేలమందికి పదోన్నతులు
Also read: Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో జోరుగా వానలు..రాగల 48 గంటల్లో అక్కడే భారీ వర్షాలు..!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోం
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook