Todays Weather: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణ అప్‌డేట్ వెలువడింది. రానున్న 24 గంటల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ సూచించింది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షసూచన ఉంది.
దక్షిణ జార్ఘండ్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావం..ఉత్తర ఒరిస్సా, దక్షిణ జార్ఖండ్, గ్యాంగ్‌టెక్, వెస్ట్ బెంగాల్ ప్రాంతాల్లో స్థిరంగా కన్పిస్తోంది. సముద్రమట్టానికి పైకి వెళ్లేకొద్దీ..ఆవర్తనం నైరుతి దిశవైపుగా సాగింది. ఫలితంగా తెలంగాణలో రానున్న 24 గంటల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడవచ్చు. కొన్ని ప్రాంతాల్లో మాత్రం భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి. ఇవాళ, రేపు తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడవచ్చు.
ఇక ఏపీలో రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ సూచించింది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. పశ్చిమ తీరప్రాంతంలో ద్రోణి విస్తరించడంతో అరేబియా సముద్రం నుంచి బలమైన ఈదురుగాలులు గట్టిగా వీస్తున్నాయి. ఫలితంగా కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయి. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే భారీగా ఈదురుగాలులు వీయడంతో బలమైన చెట్లు విరిగిపడ్డాయి.
Also read: Chiranjeevi: ప్రధాని మోడీ సభలో చిరంజీవి.. ఆయనే టార్గెట్టా? బీజేపీతో అట్లుంటది మరీ..
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook