Ration Card: రేషన్ కార్డు విషయంలో కొత్త నియమాలు వచ్చాయి. కొత్త రేషన్ కార్డుకు అర్హులెవరు, రేషన్ కార్డు సరెండర్ చేయాలంటే ఏం చేయాలి, ఇతర విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
రేషన్ కార్డుల విషయంలో చాలామందికి చాలా సందేహాలుంటాయి. రేషన్ కార్డు సరెండర్ చేయాలంటే ఎలా చేయాలి, ఎవరికి చేయాలి లేదా రేషన్ కార్డు తీసుకోవాలంటే ఏం చేయాలనే విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. ఎందుకంటే రేషన్ కార్డుకు సంబంధించి నియమాలు మారాయి. రేషన్ కార్డుల్ని తప్పుడు విధానంలో ఉపయోగిస్తే..ప్రభుత్వం వాపసు తీసుకుంటుందనే వార్తలు ఇటీవలి కాలంలో ఎక్కువగా వస్తున్నాయి. ఈ విషయంలో రైతులకు కూడా సందిగ్దత ఎదురౌతుంటుంది. అసలు రేషన్ కార్డు తీసుకోవాలంటే ఏం కావాలనేది తెలుసుకోవాలి.
కరోనా మహమ్మారి సమయంలో ప్రభుత్వం పేదలకు ఉచిత రేషన్ వ్యవస్థ ప్రారంభించింది. అయితే చాలామంది అనర్హులు కూడా లబ్ది పొందుతున్నారు. ప్రభుత్వం బోగస్ రేషన్ కార్డుల ఏరివేతపై దృష్టి సారించింది. మీరు ఒకవేళ రేషన్ కార్డుకు అనర్హులైతే..వెంటనే కార్డు సరెండర్ చేయడం మంచిది. ఉచిత రేషన్ నిబంధనల ప్రకారం లబ్దిదారుడికి వంద చదరపు మీటర్ల ప్లాట్ లేదా ఇళ్లు, ఫోర్ వీలర్ వాహనం, ట్రాక్టర్, గ్రామాల్లో ఏడాదికి 2 లక్షల ఆదాయం, పట్టణాల్లో ఏడాదికి 3 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉంటే రేషన్ కార్డుకు అర్హులు కారు. ఈ నిబంధనల ప్రకారం మీరు అనర్హులైతే వెంటనే మీ రేషన్ కార్డును తహశిల్దార్ కార్యాలయంలో సరెండర్ చేయండి.
Also read: Todays Gold Rate: మళ్లీ పెరుగుతున్న బంగారం, దేశంలో ఇవాళ మే 24న వివిధ నగరాల్లో బంగారం ధరలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook