Khichidi Benefits: వర్షాకాలంలో కొన్ని రకాల ఆహార పదార్ధాలు ఆరోగ్యానికి మంచివి. ముఖ్యంగా పెసరపప్పుతో చేసే ఖిచిడీ చాలా అద్భుత ప్రయోజనాలు కలిగింది. వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉంచేందుకు ఖిచిడీ ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం..
వాతావరణం మారింది. జోరుగా వర్షాలు పడుతున్నాయి. వేసవి నుంచి ఉపశమనం లభించిందని ఆనందించేలోగా..వర్షాల కారణంగా తలెత్తే రోగాల్నించి కూడా కాపాడుకోవాలి. వర్షాకాలంలో సహజంగానే చర్మ సంబంధిత వ్యాధులు తలెత్తుతాయి. చర్మ సంబంధిత వ్యాదుల్నించి రక్షించుకునేందుకు వివిధ రకాల మార్గాల్ని అనుసరిస్తుంటాం. ఇందులో భాగంగా ఖిచిడీ చాలా కీలకమైన ఆహారం. ఖిచిడీలో కాపర్, ఫోలెట్, రైబోఫ్లెవిన్, విటమిన్, విటమిన్ సి, ఫైబర్, పొటాషియం, ఫాస్పరస్, మెగ్నీషియం, ఐరన్, విటమిన్ బి6, నియాసిన్, థయామిన్ ఉంటాయి పేగుల్లోని వ్యర్దాల్ని తొలగించడంలో ఫైబర్ ఉపయోగపడుతుంది. అందుకే వర్షాకాలంలో పెసరపప్పును డైట్లో చేర్చుకోవాలి.
భారతీయ వంటల్లో ఖిచిడీ అనేది ఒక సాంప్రదాయ వంటకం. ఇందులో బియ్యం, పెసరపప్పు కలిపి వండుతారు. ఖిచిడీ అనేది ఆరోగ్యానికి చాలా మంచిది, తేలికగా జీర్ణమౌతుంది. అందుకే చాలామంది వైద్యులు ఖిచిడీ తినమని సలహా ఇస్తుంటారు.
ఖిచిడీ ఎలా వండాలి
ముందుగా బియ్యం, పెసరపప్పును శుభ్రంగా కడిగి కనీసం అరగంట సేపు నానబెట్టాలి. తరువాత ఒక ప్యాన్‌లో నెయ్యి వేడి చేసి అందులో కాస్త జీలకర్ర, హింగ్, వేయాలి. కాస్త వేగిన తరువాత అందులో బియ్యం పెసరపప్పు వేసి హై ఫ్లేమ్‌పై వేయించాలి. నీళ్లన్నీ డ్రై అయ్యేంతవరకూ ఇలా చేయాలి. కాస్సేపటి తరువాత స్లో ఫ్లేమ్‌పై 15 నిమిషాలుంచితే ఖిచిడీ రెడీ అయిపోతుంది.
ఖిచిడీ తినడం వల్ల బరువు కూడా తగ్గుతారు. బరువు తగ్గేందుకు శరీరంలో ప్రోటీన్ స్థాయి సరిగ్గా ఉండాలి. ఖిచిడీ తినడం వల్ల కడుపుకు సంబంధించి చాలా సమస్యలకు ఉపశమనం కలుగుతుంది. ఖిచిడీలో బాడీని డీటాక్సిఫై చేసేందుకు దోహదపడుతుంది. అందుకే ఖిచిడీని డైట్లో చేర్చడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి.
Also read: Vitamin D Symptoms: విటమిన్ డి మోతాదు మించితే ఏమౌతుంది, ఎలా తెలుస్తుంది
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook