Godavari Floods: అఖండ గోదావరి ఉగ్రరూపం దాలుస్తోంది. గంట గంటకూ వరద ప్రవాహం పెరుగుతోంది. భద్రాచలంలో 54 అడుగులకు చేరువలో ఉన్న గోదావరి వరద..మూడు ప్రమాద హెచ్చరికల్ని దాటేసింది.
గోదావరి నదీ పరివాహక ప్రాంతంతో పాటు ఉపనదీ పరివాహర ప్రాంతంలో సైతం కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి వరద పోటుతో ఉధృతంగా ప్రవహిస్తోంది. నదీ పరివాహక ప్రాంతమైన మహారాష్ట్ర, శబరి నది పరివాహక ప్రాంతమైన ఛత్తీస్‌గడ్‌లోనూ..భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. ఫలితంగా గంటగంటకూ గోదావరి నీటిమట్టం పెరుగుతోంది.
గోదావరి నదిపై ఉన్న శ్రీరాంసాగర్, కాళేశ్వరం బ్యారేజ్‌ల వద్ద వరద నీరు భారీగా చేరుతోంది. దిగువన పోలవరం స్పిల్ వే గేట్లన్నీ తెరిచి వరద నీటిని దిగువకు వదిలేస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ప్రస్తుతం 8 లక్షల క్యూసెక్కుల వరద నీరు సముద్రంలో వదులుతున్నారు. బ్యారేజ్ 175 గేట్లను పూర్తిగా ఎత్తివేశారు. వచ్చిన ఇన్‌ఫ్లోను వచ్చినట్టే దిగువకు వదులుతున్న పరిస్థితి. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి మూడు ప్రమాద హెచ్చరికలు దాటేసింది. ప్రస్తుతం అక్కడ 53.80 అడుగులకు గోదావరి నీటి మట్టం చేరింది. రేపటివరకూ ఇంకా పెరగవచ్చనే అంచనాలున్నాయి. ఇక రాత్రికి ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద తొలి ప్రమాద హెచ్చరిక జారీ కావచ్చు. రేపు ఉదయం రెండవ ప్రమాద హెచ్చరిక వరకూ చేరుకుని..క్రమేపీ తగ్గుముఖం పట్టవచ్చని అంచనా.
జూలై నెలలో ఇంత భారీగా వరద రావడం ఇదే తొలిసారి. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు మరో నాలుగైదు రోజులు కొనసాగితే మాత్రం ధవళేశ్వరం వద్ద గోదావరికి మూడు ప్రమాద హెచ్చరికలు జారీ కావచ్చు. అదే జరిగితే దిగువన కోనసీమ లంక గ్రామాలు నీట మునిగిపోతాయి.
Also read: Godavari Floods: గోదావరికి భారీగా వరద, మూడవ ప్రమాద హెచ్చరిక జారీ, భారీగా పోటెత్తుతున్న వరద నీరు
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook